కాటసాని వర్సెస్ చల్లా: గాల్లోకి కాల్పులు

లంబాడీలను ఎస్టీ నుండి తొలగించాలి
లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఆదివాసీలు ఐటిడిఏను ముట్టడించారు. ఎస్టీగా ధ్రువీకరణ పత్రాలు లంబాడీలకు ఇవ్వవద్దని వారు డిమాండ్ చేశారు. లంబాడీలకిచ్చిన గిరిజన డిఎస్సీ ధ్రువీకరణ పత్రాలు నిలుపుదల చేయాలని వారు ఆందోళనకు దిగారు.
పోలీసుల రైడింగ్
ఖమ్మం జిల్లా దమ్మపేట మండలంలోని మందరపల్లి రోడ్డును ఆనుకొని ఉన్న ఓ తోటలో నిర్వహిస్తున్న కోడిపందాల స్థావరాలపై పోలీసులు ఆదివారం అర్ధరాత్రి దాడి చేశారు. ఈ దాడిలో ఖమ్మం, పశ్చిమ గోదావరి, విశాఖపట్నం జిల్లాలకు చెందిన పదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. మరికొందరు పరారయ్యారు. వీరి నుండి భారీగా నగదును, కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దోపిడీ దొంగల బీభత్సం
మెదక్ జిల్లాలోని రామచంద్రాపురం అశోక్‌నగర్‌లో గత అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. శ్రీసాయి వైన్ సిబ్బందిపై దుండగులు వేటకొడవళ్లతో దాడి చేశారు. వారి వద్ద నుంచి రూ.4.25 లక్షల నగదును దుండగులు అపహరించారు. తీవ్రంగా గాయపడిన సిబ్బందిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.












Click it and Unblock the Notifications