సెటప్ బాక్స్‌లు: హైదరాబాద్‌లో మ్యాడ్ రష్

కేబుల్ టీవీల డిజిటైజేషన్‌కు మార్చి 31వ తేదీ గడువు విధించింది. ఈ రెండో దశ కేబుల్ టీవీ డిజైటేషన్ ప్రక్రియలో రాష్ట్రంలోని హైదరాబాదు, విశాఖపట్నం నగరాలున్నాయి. ప్రస్తుత పరిస్థితిని కేబుల్ టీవీ ఆపరేటర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. సెటప్ బాక్సులు అమర్చడానికి 2 వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి, సెటప్ బాక్సుల ఖరీదు 800 రూపాయలు మాత్రమే. గడువు వేగంగా దూసుకొస్తుండడంతో హైదరాబాదులో సెటప్ బాక్సుల కోసం విపరీతమైన డిమాండ్ పెరిగింది. వాటికి విపరీతమైన కొరత ఏర్పడింది. ఈ పరిస్థితిని కేబుల్ టీవీ ఆపరేటర్లు డబ్బులు చేసుకోవడానికి వాడుకుంటున్నారనే విమర్శలు వస్తున్నాయి.
బిఐఎస్ ప్రమాణాలతో కూడిన సెటప్ బాక్సులను ఏర్పాటు చేసుకోవాలని నియమాలున్నా నాణ్యత కొరవడిన బాక్సులు కూడా మార్కెట్లోకి వచ్చాయి.












Click it and Unblock the Notifications