బస్సులో కొరియా అమ్మాయిపై అసభ్య ప్రవర్తన

South Korean student allegedly molested on Kolkata bus
కోల్‌కతా: బ్రిటిష్ అమ్మాయి అత్యాచార యత్నాన్ని తప్పించుకోవడానికి ఆగ్రాలో హోటల్ గది నుంచి దూకిన సంఘటనను మరిచిపోక ముందే పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో ఓ విదేశీ అమ్మాయిపై అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన చోటు చేసుకుంది. సెంట్రలో కోల్‌కతాలో బస్సులో ప్రయాణిస్తున్న దక్షిణ కొరియా అమ్మాయిపై సోమవారం ఉదయం సహ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించాడు.

అమ్మాయి సహ ప్రయాణికుడిని పోలీసులు అరెస్టు చేశారు. దక్షిణ కొరియా అమ్మాయి కోల్‌కతాలో చదువుతోంది. ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఆమెపై బస్సులో ఓ సహ ప్రయాణికుడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు వచ్చాయి.

బాధితురాలు ట్రాఫిక్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దాంతో బస్సులో ప్రయాణిస్తున్నవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తిని గుర్తించి తమతో తీసుకుని వెళ్లారు.

విదేశీ మహిళలకు భారతదేశంలో రక్షణ లేదనే అభిప్రాయం రోజురోజుకూ బలపడుతోంది. దేశంలో సైకిల్ యాత్ర చేస్తున్న స్విస్ మహిళపై భర్త ఎదుటే మహారాష్ట్రలో దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఢిల్లీ బస్సులో వైద్య విద్యార్థినిపై దారుణంగా సామూహిక అత్యాచారం జరిగినప్పటి నుంచి అత్యాచారాలకు సంబంధించిన పలు ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+