మీకే.. మాకు లేదు గ్యారెంటీ!(అప్పాలో కిరణ్ పిక్చర్స్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ(అప్పా)లో గురువారం జరిగిన 2012 బ్యాచ్ ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్‌కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పోలీసులకు ఉద్యోగ భద్రత ఉందని, రాజకీయ నాయకులకు మాత్రం లేదన్నారు. పోలీసులు సిన్సియర్‌గా పని చేయాలన్నారు.
అలా అయితే ఉద్యోగ భద్రత ఉంటుందన్నారు. కానీ రాజకీయ నాయకులు ఎలా పని చేసినా ఆ సౌకర్యం లేదన్నారు. ప్రతి ఐదేళ్లకోసారి తాము ప్రజల్లోకి వెళ్లి మెప్పు పొందితేనే గెలిచే ఆస్కారముందన్నారు. దేశంలో ఎపి పోలీసులకు మంచి పేరుందన్నారు. సమయస్ఫూర్తి, బాధ్యతతో పని చేయాల్సిన వృత్తి పోలీసు ఉద్యోగం అన్నారు.
వేలాది కొత్త ఉద్యోగాలు సృష్టించిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. ఇప్పటి వరకు లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చామని మరో లక్ష తమ లక్ష్యమన్నారు. 1,256 మంది ఎస్సైలు శిక్షణ పూర్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి, డిజిపి దినేష్ రెడ్డిలు హాజరయ్యారు.

కిరణ్‌ను ఆహ్వానిస్తున్న దినేష్ రెడ్డి.

అప్పాలో సబితా ఇంద్రారెడ్డి, పోలీసు అధికారులతో ముఖ్యమంత్రి.

మాట్లాడుతున్న డిజిపి.

అప్పాలో కిరణ్

గౌరవ వందనం స్వీకరిస్తున్న ముఖ్యమంత్రి

కొత్త బ్యాచ్, కిరణ్

కొత్త బ్యాచ్

డిజిపి, హోంమంత్రి, ముఖ్యమంత్రి

పోలీసుల కవాతు

షీల్డ్ అందిస్తున్న సిఎం












Click it and Unblock the Notifications