జగన్ కేసులో సిబిఐ ముందుకు వైయస్ భద్రతాధికారి

CBI
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డికి ముఖ్య భద్రతాధికారిగా పని చేసిన ఐపిఎస్ అధికారి రమేష్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల కేసులో గురువారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సిబిఐ) విచారణకు హాజరయ్యారు. రమేష్ రెడ్డి ప్రస్తుతం పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీగా పని చేస్తున్నారు. రమేష్ రెడ్డి అప్పుడు చీఫ్ సెక్యూరిటీ అధికారిగా పని చేశారు.

జగన్ ఆస్తుల కేసుకు సంబంధించి మరో మాజీ అధికారి కూడా సిబిఐ ఎదుట హాజరయ్యారు. ఎపిఐఐసి మాజ జోనల్ మేనేజర్ దశరథ రామిరెడ్డి నేడు సిబిఐ ముందు హాజరయ్యారు. దశరథ రామిరెడ్డిని సిబిఐ నిన్న కూడా విచారించింది. దాదాపు మూడు గంటల పాటు ఆయనను విచారించింది. ఈ రోజు ఇతనితో పాటు రమేష్ రెడ్డిని విచారిస్తున్నారు. బుధవారం దశరథ రామిరెడ్డితో పాటు పెన్నా సిమెంట్ ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.

ఎమ్మార్-ఎంజిఎఫ్‌పై సిబిఐ కౌంటర్

మరోవైపు అభియోగాలను కొట్టివేయాలని ఎమ్మార్-ఎంజిఎఫ్ సంస్థ డిశ్చార్జ్ పిటిషన్ వేయడాన్ని సిబిఐ బుధవారం ఆక్షేపించింది. ఎమ్మార్ కుంభకోణంలో తమ వద్ద తగిన ఆధారాలు ఉన్నాయని, అందుకే కేసులు నమోదు చేశామని స్పష్టం చేసింది. ఎమ్మార్-ఎంజిఎఫ్ ప్రతినిధిగా శ్రవణ్ గుప్తా సిబిఐ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌కు సిబిఐ కౌంటర్ దాఖలు చేసింది.

ఎపిఐఐసినిఎమ్మార్ సంస్థ మోసం చేసిందని, ఒప్పందాలను తుంగలో తొక్కిందని కోర్టుకు వివరించింది. ఆ సమయంలో ఎపిఐఐసి ఎండిగా ఉన్న ఆచార్య కూడా ఈ మోసాలకు సహకరించినట్లు సిబిఐ తెలిపింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+