వైయస్ కుక్క చావు: గోనె మండిపడ్డారు, సర్వే తగ్గారు

వైయస్ మహానేత అని ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ, ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌లే కొనియాడారని చెప్పారు. అలాంటి వైయస్ పైన అంత దారుణంగా ఎలా మాట్లాడుతారని ప్రశ్నించారు. తెలంగాణ ఇవ్వకుంటే 2014లో కాంగ్రెసు పార్టీ నేతలను చెప్పులతో కొట్టవచ్చునని సర్వే చెప్పినది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో గన్‌మన్ లేకుండా ప్రచారానికి వెళ్లే దమ్ము సర్వేకు ఉందా అని సవాల్ చేశారు.
కంటోన్మెంట్ బోర్డు మెంబర్‌గా ఓడిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. గతంలో ఎంపీ టిక్కెట్ కోసం వైయస్ కాళ్లు పట్టుకున్న సందర్భం మర్చిపోయినట్లున్నారన్నారు. హైవేల నిర్మాణ రూట్లను మారుస్తూ సర్వే అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైయస్ పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే రాజీవ్ గాంధీ, ఇందిరా గాంధీ, సంజయ్ గాంధీల మరణాలను ఏమనాలని ప్రశ్నించారు. సభ్యత లేకుండా మాట్లాడటం ఆయనకే చెల్లిందన్నారు.
వెనక్కి తీసుకుంటున్నా
మరోవైపు వైయస్ రాజశేఖర రెడ్డి కుక్క కన్నా హీనంగా చచ్చాడని సర్వే సత్యనారాయణ నాలుగు రోజుల క్రితం అన్న విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను తాను వెనక్కి తీసుకుంటున్నట్లు సర్వే చెప్పారు. తాను వైయస్‌పై ఉద్దేశ్య పూర్వకంగా అలాంటి వ్యాఖ్యలు చేయలేదన్నారు. వాటిని తాను వెనక్కి తీసుకుంటున్నానన్నారు.
-
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!! -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- నేడు ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు -
రూపాయి సేఫ్: ఒక్కరోజే భారీ లాభం!












Click it and Unblock the Notifications