'చంద్రబాబు వస్తే మంచి రోజులు': భద్రత లేదన్న కిరణ్

విద్యుత్ ఉద్యమంతో అధికారానికి దూరమైన తెలుగుదేశం పార్టీ మళ్లీ అదే విద్యుత్ ఉద్యమంలో పాల్గొని తిరిగి అధికారంలోకి రావాలని కోరుకుంటున్నానని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మెజార్టీ కోల్పోయి ఐసియులో ఉన్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి అన్నారు. విద్యుత్ ఉద్యమంతో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అధికారం కోల్పోవడం ఖాయమన్నారు. 2014 ఎన్నికల తర్వాత కేంద్రంలో కాంగ్రెసు, బిజెపియేతర ప్రభుత్వం ఏర్పడుతుందని జోస్యం చెప్పారు.
మాకు భద్రత లేదు!
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అప్పాలో ఈ రోజు జరిగిన 2012 బ్యాచ్ ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్‌లో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసులకు ఉద్యోగ భద్రత ఉందని, రాజకీయ నాయకులకు మాత్రం లేదన్నారు. పోలీసులు సిన్సియర్‌గా పని చేయాలన్నారు. అలా అయితే ఉద్యోగ భద్రత ఉంటుందన్నారు. కానీ రాజకీయ నాయకులు ఎలా పని చేసినా ఆ సౌకర్యం లేదన్నారు.
ప్రతి ఐదేళ్లకోసారి తాము ప్రజల్లోకి వెళ్లి మెప్పు పొందితేనే గెలిచే ఆస్కారముందన్నారు. దేశంలో ఎపి పోలీసులకు మంచి పేరుందన్నారు. సమయస్ఫూర్తి, బాధ్యతతో పని చేయాల్సిన వృత్తి పోలీసు ఉద్యోగం అన్నారు. వేలాది కొత్త ఉద్యోగాలు సృష్టించిన ఘనత తమ ప్రభుత్వానిదే అన్నారు. ఇప్పటి వరకు లక్షన్నర ఉద్యోగాలు ఇచ్చామని మరో లక్ష తమ లక్ష్యమన్నారు.












Click it and Unblock the Notifications