ఏ పార్టీతోనూ పొత్తులుండవు, విలీనం ఉండదు: కెసిఆర్

K Chandrasekhar Rao
హైదరాబాద్: భవిష్యత్తులో ఏ పార్టీతోనూ పొత్తులుండవని, అలాగే ఏ పార్టీలోనూ తమ పార్టీని విలీనం చేసే అవకాశం లేదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు స్పష్టం చేశారు. మెదక్ జిల్లాలోని తన ఫాంహౌజ్ నుంచి బుధవారం మధ్యాహ్నం ఆయన తెలంగాణ భవన్‌కు వచ్చారు.

ఇకపై రోజూ తెలంగాణ భవన్‌కు వస్తానని, భోజనం కూడా ఇక్కడికే తెప్పించుకుంటానని ఆయన అన్నారు. పార్టీ శాసనసభా పక్ష నేత ఈటెల రాజేందర్, ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, కె.తారకరామారావు, సీనియర్ నేతలు నాయిని నరసింహారెడ్డి, జి.జగదీశ్‌రెడ్డి, కర్నె ప్రభాకర్, డి.శ్రవణ్ కుమార్, బొంతు రామ్మోహన్ తదితరులతో ఆయన భేటీ అయ్యారు.

తెలంగాణపై కాంగ్రెస్ వైఖరి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు, ఈనెల 30న నిర్వహించాలనుకుంటున్న పొలిట్‌బ్యూరో తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఇదే సమయంలో కేసీఆర్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. 2004 ఎన్నికలకంటే ముందు ఎలా హల్‌చల్ చేశామో, ఇప్పుడూ అదేరకంగా పార్టీ శ్రేణులను కదిలించాలని ఆయన అన్నారు.

స్థానిక సంస్థలు, సాధారణ ఎన్నికల హడావుడి మొదలైతే గ్రేటర్ హైదరాబాద్‌పై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టడం, ఇతర ప్రాంతాల నేతలతో పార్టీ పటిష్ఠత కోసం చర్యలు చేపట్టడం సాధ్యం కాదని, ఆలోపే నగరంలో 'గడప గడపకు పార్టీ'ని తీసుకెళ్లాలని నిర్ణయించారు. స్థానిక సంస్థలకు ఎన్నికలు జూన్‌లో ఉండవచ్చని.. అందువల్ల ఏప్రిల్ రెండో వారం నుంచి నియోజకవర్గాలు, మండలాలవారీగా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు కెసిఆర్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+