ఫొటోలు: టిడిపి అధినేత చంద్రబాబు స్టయిల్ మారిందా?
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి వస్తున్నా... మీకోసం పాదయాత్ర సెంచరీ దాటింది. అనంతపురం జిల్లా హిందూపురం నుంచి ప్రారంభించిన ఆయన పాదయాత్ర తూర్పు గోదావరి జిల్లాకు చేరుకుంది. మొదట జనవరి 26ల తేదీన పాదయాత్రను ముగించాలని చంద్రబాబు అనుకున్నారు. కానీ, పార్టీ నాయకుల నుంచి, కార్యకర్తల నుంచి విజ్ఞప్తులు రావడంతో తన పాదయాత్రను పొడగించారు.
పాదయాత్రకు ముందే ఆయన తన సహజసిద్దమైన కొన్ని శైలులను మార్చుకున్నారు. రెండు వేళ్లతో విజయసూచకంగా విక్టరీ సింబల్‌ను చూపించే శైలిని పూర్తిగా మార్చుకున్నారు. రెండు చేతులూ జోడించి దండం పెడుతూ ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజల కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటున్నారు.
ప్రజల కష్టాలను ఆయన అతి సమీపం నుంచి చూసే ప్రయత్నం చేస్తున్నారు. శరీరం అప్పుడప్పుడూ మొరాయిస్తోంది. వైద్యులు విశ్రాంతి అవసరమని చెబుతున్నారు. కానీ, వారి మాటలను లెక్క చేయకుండా ఆయన పాదయాత్ర సాగిస్తున్నారు. ప్రజలతో ఆయన మిలాఖత్ అవుతూ వచ్చే ఎన్నికలకు సిద్ధమవుతున్నారు. ఈ నెల 27వ తేదీన ఆయన తన పాదయాత్రను ముగించాలని అనుకుంటున్నారు.

పార్టీ నాయకులతో, కార్యకర్తలతో కలిసి చంద్రబాబు ఇలా పాదయాత్ర చేస్తున్నారు. ఈ సమయంలో ఆయన సాదాసీదాగా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబు నవ్వగా చూడలేదనేవారు చాలా మంది అంటారు. ఈ విషయంలో దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి చంద్రబాబుపై వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు. కానీ, చంద్రబాబు ఇలా నవ్వుతున్నారు కూడా..

ప్రజలను ఇలా పలకరిస్తూ వారి కష్టసుఖాలు తెలుసకుంటున్నారు.

చెవి పెట్టి ఎవరు ఏమి చెప్పినా చంద్రబాబు శ్రద్ధగా వింటున్నారు. పునాది స్థాయిలో ప్రజల కష్టాలు తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

అడుగు తీసి అడుగు వేస్తూ రెండు వేల 500 కిలోమీటర్లకు పైగా నడిచారు.

చంద్రబాబును చూసి ప్రజల ముఖాల్లో ఇలా నవ్వు కూడా పూస్తోంది.

ప్రజల్లో కలిసిపోవడానికి ఇలా తన దర్పాన్ని కూడా వదిలేశారా..

అవకాశం చిక్కితే చాలు, పిల్లలతో మాట్లాడడానికి చంద్రబాబు ఇష్టపడుతున్నారు.

నాయకుల భుజాల మీద చేయి వేసి చంద్రబాబు వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
పార్టీ సమావేశాలు కూడా తన పాదయాత్రలోనే నిర్వహిస్తున్నారు. నాయకులకు అక్కడి నుంచే మార్గదర్శనం చేస్తున్నారు. శానససభ సమావేశాల్లో శాసనసభ్యులు అనుసరించాల్సిన వ్యూహంపై పాదయాత్ర నుంచే ఆయన సూచనలు చేశారు.












Click it and Unblock the Notifications