ఈవ్ టీజింగ్: కూతురిని వేధించారు, తండ్రిని చంపారు

వేధింపులు భరించలేక ప్రవల్లిక తండ్రికి చెప్పింది. దీంతో ఆయన సాగర్‌ను నిలదీశాడు. అయినా సాగర్ ప్రవర్తనలో మార్పురాలేదు. వారం రోజుల క్రితం సాగర్ కుటుంబసభ్యులను కలిసి రాజ్‌కుమార్ తన కుమార్తెను వేధిస్తే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించాడు.
ప్రవల్లిక తండ్రి తన కుటుంబసభ్యులను హెచ్చరించినట్టు తెలుసుకున్న సాగర్ అతడిపై కక్ష పెంచుకున్నాడు. తనను పెళ్లి చేసుకోకపోతే మీ తండ్రిని చంపేస్తానని ప్రవల్లికను బెదిరించాడు. బుధవారం మధ్యాహ్నం తల్లిదండ్రులు నాగయ్య, స్వరూప, వరుసకు సోదరుడైన శ్రీకాంత్‌ను తీసుకొని రాజ్‌కుమార్ ఇంటికి వెళ్లాడు. ప్రవల్లికను తనకిచ్చి వివాహం చేయమని అడిగాడు. తన కుమార్తెను ఇచ్చేది లేదని రాజ్‌కుమార్ చెప్పాడు. ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. నలుగురూ కలిసి రాజ్‌కుమార్‌పై దాడి చేసి కొట్టారు.
తీవ్రమైన గాయాలు కావడంతో రాజ్‌కుమార్ మృతిచెందాడు. ఘర్షణ జరుగుతున్నట్టు తెలుసుకున్న స్థానికులు రాజ్‌కుమార్ ఇంటికి వచ్చారు. సాగర్, శ్రీకాంత్‌ను పట్టుకొని బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు. సాగర్ కుటుంబసభ్యులు దాడి చేయడం వల్లే రాజ్‌కుమార్ మృతిచెందాడని అతడి భార్య సరోజిని, కుమార్తె ప్రవల్లిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.












Click it and Unblock the Notifications