ఎత్తుకెళ్లి యువతిపై దారుణం: తిరుమలలో ప్రేమజంట...

అంగ, మానసిక వైకల్యంతో బాధపడుతున్న పదకొండేళ్ల ఈ కొడుకును తండ్రి గొంతు నులిమి చంపాడు. ఆ తర్వాత మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి ఇంట్లోనే ఉంచాడు. పోలీసులు తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. పేదరికంతో వైద్యం చేయించలేక కొడుకును చంపినట్లుగా పోలీసులకు చెప్పినట్లు తెలుస్తోంది.
కూతురును చంపిన తండ్రి
పద్నాలుగు నెలల కూతురును తండ్రి కడతేర్చిన సంఘటన నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలంలోని దుర్కి గ్రామంలో ఈ రోజు ఉదయం చోటు చేసుకుంది. గంగారాం అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. కూతురు పట్టడం ఇష్టం లేకపోవడంతో గంగారం భార్యతో గొడవపడ్డాడు. కూతురుని చంపేస్తానంటూ బెదిరించాడు. ఈ రోజు ఉదయం కుమారులు చూస్తుండగానే కూతురు గొంతు నులిమి హత్య చేశాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
ప్రకాశం జిల్లాలో దారుణం
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం సింగరాయకొండలో 18 ఏళ్ల యువతి సామూహిక అత్యాచారానికి గురైంది. సింగరాయకొండలో జరిగిన తిరునాళ్లకు స్నేహితులతో కలిసి వెళ్లిన ఆమెను బుధవారం రాత్రి కొందరు దుండకులు ఎత్తుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. నలుగురు నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కృష్ణా జిల్లాలో...
బంటుమిల్లి మండలం జానకిరామాపురంలో ఓ యువతి అనుమానాస్పద మృతి చెందింది. గురువారం ఉదయం ఆమె మృతదేహం కనిపించింది. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. యువతికి రెండు నెలల క్రితమే వివాహమైంది. ఈమెపై దుండగులు అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లుగా అనుమానిస్తున్నారు.
తిరుమలలో..
తిరుమల కాలి నడక బాటలో ప్రేమ జంట ఆత్మహత్యయత్నం చేసింది. మోకాలి మెట్టు దగ్గర వారు ఈ ఆత్మహత్యయత్నం చేశారు. వారు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యయత్నం చేసిన వారు గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన రాజు, శిరీషలుగా గుర్తించారు.












Click it and Unblock the Notifications