నారా లోకేష్ బిజీ బిజీ: 1న ఈస్ట్‌కు, పార్టీపై ప్రత్యేక దృష్టి

ఆనంద భారతి గ్రౌండ్‌లో ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్రంలో లోకేష్ వివిధ ప్రాంతాల్లో పార్టీ పరంగా పర్యటిస్తున్న నేపథ్యంలో యువత, టిఎన్ఎస్ఎఫ్, టిఎన్ఎస్‌వి అనుబంధ సంఘాలతో పాటు ఆయా జిల్లాల నాయకత్వాల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. నారా లోకేష్ కాకినాడలో తొలిసారిగా భారీ బహిరంగ సభకు హాజరవుతున్న నేపథ్యంలో కార్యకర్తలు సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల చిత్తూరు జిల్లాలో పర్యటించిన లోకేష్ వరుసగా అన్ని జిల్లాల్లో పర్యటించాలని భావిస్తున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పార్టీ శ్రేణులు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమ నిర్వహణ బాధ్యతలను కొండబాబుతోపాటు రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ తీసుకున్నారు. దీనికి సంబంధించి ఆనంద భారతి గ్రౌండ్‌ను ముస్తాబు చేస్తున్నారు. 31వ తేదీన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఈ గ్రౌండ్‌లో రాత్రికి బస చేస్తారు.
పెదపూడిలో 29న ఆవిర్భావ దినోత్సవం టిడిపి ఆవిర్భావ దినోత్సవం ఈనెల 29న పెదపూడిలో పెద్దఎత్తున నిర్వహిస్తున్నారు. పార్టీ ఏర్పడి 31 సంవత్సరాలు పూర్తవడంతో కార్యక్రమాన్ని చంద్రబాబు ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడుతో పాటు రాష్ట్రస్థాయి నేతలు పెదపూడికి తరలిరానున్నారు. 31 సంవత్సరాల వేడుకకు సంబంధించి కేక్‌ను చంద్రబాబు కట్ చేస్తారు.












Click it and Unblock the Notifications