సన్‌రైజర్స్‌లో లంక ప్లేయర్స్: జయలలితకి దొరికిన కరుణ

చెన్నైలో లంక ఆటగాళ్లను ఆడనిచ్చేది లేదని అధికార, ప్రతిపక్ష పార్టీలు గొంతెత్తిన విషయం తెలిసిందే. జయలలిత ఏకంగా ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు ఆడనిచ్చేది లేదంటూ లేఖ రాశారు. అయితే, తీర్మానం సమయంలో జయలలిత మాట్లాడుతూ.. కరుణానిధి శ్రీలంక తమిళులపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని విమర్శించారు. శ్రీలంక తమిళుల కోసం పోరాడుతున్నామని, శ్రీలంక ఆటగాళ్లను ఆడనిచ్చేది లేదని చెబుతున్న కరుణ మొదట తన మనువడి సన్ రైజర్స్ జట్టులో శ్రీలంక ఆటగాళ్లు ఉన్న విషయంపై స్పందించాలని డిమాండ్ చేశారు.
ఐపిఎల్ -6లో ఆడుతున్న కరుణానిధి మనువడు మారన్ సన్ రైజర్స్ జట్టులో శ్రీలంక ప్లేయర్లు ఉన్నారని ఆమె గుర్తు చేశారు. లంక ఆటగాడు కుమార సంగక్కర జట్టు సారథిగా ఉన్నాడని, తిసారా పెరారే కూడా జట్టులో ఉన్నాడని ఆమె గుర్తు చేశారు. శ్రీలంక తమిళుల కోసం పోరాడుతున్నామని చెబుతున్న కరుణానిధి తన మనువడి జట్టులో లంక తమిళులు ఉండటాన్ని ఎలా సమర్థిస్తారని ప్రశ్నించారు. ఇది కరుణ ద్వంద వైఖరికి నిదర్శనం అన్నారు.
ఓవైపు జట్టులో లంక ఆటగాళ్లు ఉండగా మరోవైపు తమిళుల కోసం పోరాడుతున్నామని చెప్పడం ఆయన స్వార్థానికి తార్కాణం అన్నారు. శ్రీలంకకు ఆయన అనుకూలంగా ఉన్నట్లయితే యూపిఏ-2కు తిరిగి మద్దతివ్వాలని అలాకాకుండా శ్రీలంక తమిళుల కోసం ఉద్యమించ దల్చుకుంటే సన్ రైజర్స్ జట్టులోని లంక ఆటగాళ్ల గురించి స్పందించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications