టిడిపికి హరీ..: జూ. ఎన్టీఆర్ మౌనం అంగీకారం?

హైదరాబాద్: నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీకి రాజ్యసభ సభ్యుడు హరికృష్ణ, ఆయన కుమారుడు జూనియర్ ఎన్టీఆర్ దూరమైనట్లేనా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కృష్ణా జిల్లాలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతల ఫొటోలతో పాటు తన ఫొటోలను కూడా కలిపి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై వివాదం చెలరేగుతున్నా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడడం లేదు. ఆయన మౌనంపై పలు ప్రశ్నలు, అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తన ఫ్లెక్సీలపై మాట్లాడడం లేదంటే అందుకు జూనియర్ ఎన్టీఆర్ పరోక్షంగానో, ప్రత్యక్షంగానో మద్దతు ఇస్తున్నారనే ప్రచారం సాగుతోంది. జూనియర్ ఎన్టీఆర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ఓ తెలుగు దినపత్రిక వార్తాకథనాన్ని కూడా ప్రచురించింది. దీనిపై కూడా ఎన్టీఆర్ స్పందన లేదు. అంటే, ఆయన వైయస్సార్ కాంగ్రెసులో చేరుతారని కచ్చితంగా చెప్పలేం గానీ పరోక్ష మద్దతు ఏమైనా ఇస్తుండవచ్చుననే ప్రచారానికి మాత్రం బలం చేకూరుతోంది.

జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడికి, బాబాయ్ బాలకృష్ణకు పూర్తిగా దూరమైనట్లేనని భావిస్తున్నారు. వారు కూడా జూనియర్ ఎన్టీఆర్‌ను బుజ్జగించడానికి సిద్ధంగా లేరని అంటున్నారు. జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రోత్సహించకూడదని కూడా వారు అనుకుంటున్నారని సమాచారం. ఈ స్థితిలోనే చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ పూర్తి స్థాయిలో పార్టీలోకి వచ్చే అవకాశాలున్నాయి.

NTR - Harikrishna

కాగా, పార్టీ వారసత్వంపై కినుక వహించిన నందమూరి హరికృష్ణ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో పాలు పంచుకోవడం లేదు. విద్యుత్ చార్జీలకు వ్యతిరేకంగా పాత ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పార్టీ శాసనసభ్యులు చేపట్టిన దీక్షల శిబిరానికి కూడా ఆయన రాలేదు. నిమ్స్‌లో చేరిన ఎమ్మెల్యేల వద్దకు కూడా ఆయన రాలేదు. గతంలో హరికృష్ణ ఇటువంటి విషయాల్లో చాలా క్రియాశీలకంగా వ్యవహరించేవారు. చంద్రబాబు పాదయాత్రలో కూడా మొదట్లో తప్ప ఇప్పుడు అసలు కనిపించడం లేదు.

కృష్ణా జిల్లా రాజకీయ పరిణామాలు కూడా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ ఆలోచనలకు అనుగుణంగానే సంభవిస్తున్నాయని అంటున్నారు. కొడాలి నాని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరిన తర్వాత వల్లభనేని వంశీ చంద్రబాబుపై తాజాగా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా గద్దె రామ్మోహన్ రావు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ భవిష్యత్తులో ఏం చేయబోతున్నారనే విషయంపై ఆసక్తికరమైన చర్చ రాజకీయ రంగంలో చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+