కిరణ్‌ను వెనుకేసుకొచ్చిన బొత్స: భగ్గుమన్న డిఎల్

కిరణ్ తీసుకునే నిర్ణయాలు కాంగ్రెసు పార్టీ నిర్ణయాలే అన్నారు. కాంగ్రెసు పార్టీ ఎప్పుడు పేదల పక్షపాతి అన్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు అంశంలో పేదలపై భారం పడకుండా చూస్తామని చెప్పినా ప్రతిపక్షాలు ఆందోళన చేయడం అర్థరహితమన్నారు. ధనవంతులకు విద్యుత్ ఛార్జీలు పెరగకుండా ఉండేందుకే వైయస్సార్ కాంగ్రెసు పార్టీతో సహా ఇతర ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నాయని మండిపడ్డారు.
విద్యుత్ ఛార్జీల పెంపుతో పార్టీకి ఇబ్బందులు తప్పవని అయితే అది పేదల ప్రజలపై భారం పడితేనే అన్నారు. తాము పేదలపై భారం పడకుండా చూస్తామన్నారు. సమన్వయ కమిటీ ఏర్పాటు చేయమని డిమాండ్ చేయడంలో తప్పు లేదన్నారు. ఛార్జీల పెంపు విషయంలో పార్టీలో చర్చించాలన్నారు. ఈఆర్సీ ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. కిరణ్ నిర్ణయాలు కాంగ్రెసు నిర్ణయాలే అన్నారు. విద్యుత్ ఛార్జీలు ఇంకా పెరగలేదని బొత్స అన్నారు.
ఛార్జీలపై డిఎల్ భగ్గు
ఛార్జీల పెంపు ప్రతిపాదనపై మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి భగ్గుమన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన హయాంలో చేసిన తప్పే మనం ఎందుకు చేయాలని కిరణ్ ప్రభుత్వాన్ని డిఎల్ ప్రశ్నించారు. కిరణ్ ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications