• search
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కుక్క సాక్ష్యంతో శిక్ష పడింది: ఛానల్లో బాబా రాసలీలలు

By Srinivas
|
Bombay HC upholds conviction based on dog’s evidence
ముంబై/బెంగళూరు: ఓ కుక్క సాక్ష్యంతో ఓ నిందితుడికి జీవితఖైదు పడింది. ఓ పోలీస్ జాగిలం సాక్ష్యం పరిగణనలోకి తీసుకున్న బాంబే హైకోర్టు ఒకరికి జీవిత ఖైదు విధించింది. ఇదే కేసులో మరొకరికి జీవిత ఖైదు విధించి, ముగ్గురిని నిర్దోషులుగా ప్రకటించింది. 2003 జనవరి 19న ముంబైలోని సబర్బన్ ఘట్కోపర్ ఏరియాలోని మమతా కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో దోపిడీ, హత్యలు జరిగాయి.

ఈ కేసులో ఐదుగురిని నిందితులుగా పేర్కొంటూ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ నిర్వహించిన సేవ్రీ సెషన్స్ కోర్టు వీరందరినీ దోషులుగా నిర్ధారిస్తూ 2007లో తీర్పు చెప్పింది. నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ పిడి కోడే, జస్టిస్ వికెతహిల్రమణితో కూడిన ధర్మాసనం ఈ కేసులో పోలీస్ జాగిలం సాక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుంది. సంఘటన స్థలంలో దొరికిన ఆధారాలతో కాథ్యా లా అలియాస్ రాజా రమేష్ చవాన్‌ను ఆ కుక్క గుర్తించింది. దీనినే కీలక సాక్ష్యంగా పరిగణించిన జడ్జిలు చవాన్‌కు జీవితఖైదు విధించారు.

ఓ బాబా లీలలు!

నిత్యానందుడి రాసలీలల తర్వాత తాజాగా కన్నడ నాట మరో బాబా బావ అవతారమెత్తాడట. ఓ చానల్‌లో ప్రసారమైన బాబా శృంగార లీలలు చూసి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చిక్కబళ్లాపురంలో ఆశ్రమం నిర్వహిస్తున్న సదరు బాబా కామ కార్యకలాపాలు ఆదివారం వెలుగు చూశాయి.

ఓ మహిళతో బాబా కామకేళి నిర్వహిస్తున్న సిడిని స్థానిక చానల్ ప్రసారం చేయడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కర్ణాటక రక్షణ వేదిక సహా కొన్ని స్థానిక సంస్థల కార్యకర్తలు ఆశ్రమంపై దాడికి ప్రయత్నించారు. ఆ సమయంలో బాబా లేరు. అనంతపురానికి వెళ్లిపోయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆశ్రమం వద్ద పెద్ద ఎత్తున పోలీసు బలగాలను మొహరించారు. బాబాపై కేసు నమోదైంది.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

lok-sabha-home

English summary

 Relying on a police dog’s evidence, the Bombay high court has held a man guilty in a robbery and murder case and upheld the life sentence given to him by a lower court.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి

Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more