రాహల్ గాంధీ సర్వే: ఎపి రహస్య జాబితా రెడీ

Rahul Gandhi
హైదరాబాద్: కేంద్రంలో అధికారంలోకి రావడానికి కీలకమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రత్యేకంగా దృష్టి సారించారు. రాష్ట్రంలో అత్యధిక సీట్లు గెలుకోవడానికి వీలైన వ్యూహరచనకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలోని లోకసభ స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను స్వయంగా రాహుల్ గాంధీ తన భుజాన వేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఓ సర్వే చేయించినట్లు తెలిసింది. వివిధ కోణాలలో జరిగిన ఈ సర్వేలో వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో ఏ అభ్యర్థి అయితే పార్టీకి ప్రయోజనకరంగా ఉంటుందనే విషయంపై ఇప్పటికే ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది.

రాహుల్ గాంధీ సర్వే ప్రకారం రూపొందిన నివేదిక రాష్టస్థ్రాయి నాయకత్వం దృష్టికి రాలేదని తెలుస్తోంది. ఎవరి జాతకం ఎలా ఉంది, ఇప్పటికే సిట్టింగ్‌ ఎమ్మెల్యేలుగా ఉన్న వారి స్థానాలు నిలుస్తాయా, గల్లంతవుతాయా అన్నది చర్చనీయాంశమైంది. పార్టీలో యువరక్తం పెంచాలని భావిస్తున్న రాహుల్‌గాంధీ తన సర్వేలో యువతకు పెద్ద ఎత్తున్న అసెంబ్లీ, లోక్‌సభ టిక్కెట్ల కేటాయింపుల్లో పెద్ద పీట వేస్తారనే మాట వినిపిస్తోంది. సర్వే ఆధారంగా ప్రాథమికంగా లోకసభ అభ్యర్థుల ఎంపికపై రాహుల్ గాంధీ ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు.

కేంద్రంలో కాంగ్రెసు తిరిగి అధికారంలోకి రావాలంటే ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం గెలిచిన స్థానాలను తిరిగి నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యత ఉందని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ఇందుకు అన్ని మార్గాలలోనూ పార్టీని పటిష్టంచేసే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఎన్నికల్లో గెలవడమే ధేయ్యంగా అభ్యర్థుల ఎంపిక చేపట్టాలని భావిస్తోంది.

ఏ అభ్యర్థిని ఎంపిక చేస్తే అతనికి ప్రజల్లో ఉన్న బలం ఎంతా? అతని ఆ నియోజకవర్గం ప్రజలలో కనీసమైన గుర్తింపు ఉందా, అతని సామాజికవర్గం నుంచి అతనికి అందే అండదండలు, అదే సామాజిక వర్గంనుంచి ఇతర ప్రత్యర్థి పార్టీలో ఉండే నేతలకు ఉన్న ప్రజాదరణ ఇలా అన్ని కోణాలలోనూ సర్వే సాగినట్లు చెబుతున్నారు. ఏ నియోజకవర్గంలో ఏయే పార్టీ బలంగా ఉంది, తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెస్‌, తెరాస ఇలా ఏ పార్టీ అభ్యర్థి బలమెంతా, ఆయా ప్రత్యర్థి అభ్యర్థులను ఎదుర్కోవాలంటే తమ పార్టీ అభ్యర్థి అంతకంటే బలమైన వాడు ఉండాలనే విషయంపై ఆరా తీస్తున్నారు.

కొంత మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యే, ఎంపీలపై ప్రజల్లో వ్యతిరేక ఉన్నట్లు ఈ సర్వేలో తేలినట్లు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఈ సిట్టింగ్‌లకు ఏ మేర అవకాశం ఉంటుందో చెప్పలేమని పార్టీ సీనియర్‌ నేత ఒకరు చెబుతున్నారు. ఇదిలావుంటే ప్రస్తుతం ఉన్న ఎంపీ, ఎమ్మెల్యేలు పార్టీ అభివృద్ధి కోసం కేటాయిస్తున్న సమయం ఎంతా, పార్టీలోనే అతను ఉంటాడా లేక భవిష్యత్తులో జంప్‌ అవుతాడా అన్న కోణంలోనూ ఈ సర్వే సాగిందని ప్రచారం సాగుతోంది.

కొత్త వారిని తెరపైకి తీసుకొస్తే సొంత పార్టీలో వచ్చే వ్యతిరేకత గురించి, పార్టీలో గ్రూపులు కడుతున్న వారి గురించి కూడా అంతర్గతంగా అధ్యయనం సాగుతన్నట్లు తెలిసింది. ఇప్పటికే గెలుపు గుర్రాల విషయంలో రాహుల్‌గాంధీకి ప్రాథమిక నివేదిక అందినట్లు తెలిసింది. దాని ప్రకారమే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+