కడప జిల్లా ప్రమాదంలో 8 మంది హైదరాబాదీల మృతి

Kadapa Dist
కడప/ హైదరాబాద్: కడప జిల్లాలో మంగళవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. కడప జిల్లా రైల్వే కోడూరు మండలం కుక్కలదొడ్డి గ్రామం వద్ద ఇన్నోవా, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఎనిమిది మరణించారు. మృతులు హైదరాబాదులోని చక్రంపేటకు చెందినవారని తెలుస్తోంది.

హైదరాబాదు నుంచి తిరుపతి వెళ్తున్న ఇన్నోవాను సిమెంట్ లోడ్‌తో కడపకు వస్తున్న లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. ఇన్నోవాలో ప్రయాణిస్తున్నవారంతా ఒకే కుటుంబానికి చెందినవారని, వారు తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్తున్నారని సమాచారం. ఈ ప్రమాదం నుంచి ఓ చిన్నారి మాత్రం బయటపడినట్లు తెలుస్తోంది. పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

హైదరాబాదులో అగ్నిప్రమాదం

ఇదిలావుంటే, హైదరాబాదులోని కోఠీ ఉస్మానియా వైద్య కళాశాల వద్ద భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్రిప్రమాదంలో ప్రాణ నష్టమేదీ సంభవించలేదు. కానీ భారీగా ఆస్తి నష్టం జరిగింది. మంగళవారం తెల్లవారు జామున దుకాణానికి మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. ఆ మంటలు 18 దుకాణాలకు వ్యాపించాయి.

మంటలను ఆర్పడానికి ఫైరింజన్లు ప్రయత్నిస్తున్నాయి. ఈ అగ్ని ప్రమాదంతో కోఠీ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఆ ప్రాంతంలో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. చెప్పులు, స్వెట్టర్లు, పుస్తకాలు తదితర సామాన్లు విక్రయించే దుకాణాలకు మంటలు అంటుకున్నాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం సంభవించినట్లు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+