బిటెక్ విద్యార్థినిపై జిమ్ యజమాని రేప్

ఆదివారం సాయంత్రం ప్రశాంత్ రెడ్డి అమ్మాయిని ఎల్బీనగర్ బాలాజీనగర్‌లో గల తన ఇంటికి పిలిచాడు. తన జిమ్‌లో సాధన చేస్తున్న ఆమె బాయ్‌ఫ్రెండ్ గురించి ముఖ్యమైన విషయాలు కొన్ని చెప్తానని అతను ఆమెను తన ఇంటికి పిలిచాడు.
దాంతో ఆమె అతని ఇంటికి వెళ్లింది. ఇంట్లో ప్రశాంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు. ఆమె ఇంట్లోకి రాగానే ప్రధాన ద్వారం బోల్ట్ పెట్టేసి ఆ విద్యార్థినిపై అత్యాచారానికి దిగాడు. విషయం ఎవరికైనా చెప్తే చంపేస్తానని ప్రశాంత్ రెడ్డి బాధితురాలిని బెదిరించాడు.
ప్రశాంత్ రెడ్డిపై బాధితురాలు సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రశాంత్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిని వైద్య పరీక్ష నిమిత్తం ఆస్పత్రికి పంపించారు.












Click it and Unblock the Notifications