ఫొటోలు: చార్జీలపై హామీ, సిఎం ఇందిరమ్మ బాట ఇలా..

నెల్లూరు: కరెంట్ చార్జీలు పెరగవని, పేదవారికి ఇబ్బంది కలుగకుండా చూస్తామని ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో రెండో రోజు మంగళవారం ఇందిరమ్మ బాట సందర్భంగా చేగనం చేరుకున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అక్కడి ప్రజలతో ముఖాముఖి నిర్వహించారు. ఈ నేపథ్యంలో విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయని, కరెంట్ చార్జీలు పెంపుపై అక్కడి ప్రజలు ముఖ్యమంత్రిని నిలదీశారు.

దానికి ముఖ్యమంత్రి ప్రతిస్పందించారు కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, హైదరాబాద్ వెళ్లాక ఈఆర్సీ నిర్ణయాలను సమీక్షిస్తానని సీఎం ప్రకటించారు. విద్యుత్ చార్జీల పెంపుపై ఈ నెల 4,5 తేదీల్లో మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నిర్వహిస్తామని ఆయన చెప్పారు.

కోమటిగుంట, రాజుపాలెం నుంచి రాష్ట్ర ప్రజలకు హామీ ఇస్తున్నామని, పేదలపై కరెంటు భారం పడకుండా చూస్తామని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. ఐ.కె.పి. మహిళలతో సీఎం ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనయ కెజిఆర్ పాళెం ఇందిర జలప్రభ కార్యక్రమంలో పాల్గొన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన చెప్పారు. ఇందిరమ్మ బాట నిర్వహిస్తున్న సమీపంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కాన్వాయ్‌లోకి ఓ ప్రైవేట్ కారు దూసుకుని వచ్చింది. దీంతో కలకలం చెలరేదింది.

 ఫొటోలు: సిఎం ఇందిరమ్మ బాట ఇలా..

ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కెజిఆర్ పాళెంలో లబ్ధిదారులతో మాట్లాడుతూ

 ఫొటోలు: సిఎం ఇందిరమ్మ బాట ఇలా..

ఇందిర జలప్రభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.

 ఫొటోలు: సిఎం ఇందిరమ్మ బాట ఇలా..

ఇందిర జలప్రభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

 ఫొటోలు: సిఎం ఇందిరమ్మ బాట ఇలా..

మొక్కలు నాటుతూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రులు కూడా ఉన్నారు.

 ఫొటోలు: సిఎం ఇందిరమ్మ బాట ఇలా..

ఇందిర జలప్రభ ఛాయాచిత్ర ప్రదర్శనను తిలకిస్తున్న ముఖ్యమంత్రి

 ఫొటోలు: సిఎం ఇందిరమ్మ బాట ఇలా..

ఇందిరమ్మ బాటలో లబ్ధిదారులతో ముచ్చటిస్తూ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

 ఫొటోలు: సిఎం ఇందిరమ్మ బాట ఇలా..

సైదాపురం మండలంలోని చెగనం గ్రామంలోని ఇందిరమ్మ అమృతహస్తం కెంద్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి

 ఫొటోలు: సిఎం ఇందిరమ్మ బాట ఇలా..

ఇందిరమ్మ అమృతహస్తం కేంద్రంలో ముఖ్యమంత్రి ఇలా..

 ఫొటోలు: సిఎం ఇందిరమ్మ బాట ఇలా..

ఇందిరమ్మ అమృతహస్తం కేంద్రంలో కిరణ్ కుమార్ రెడ్డి..

 ఫొటోలు: సిఎం ఇందిరమ్మ బాట ఇలా..

ఇందిరమ్మ అమృత హస్తం కేంద్రాన్ని సందర్శించి ముఖ్యమంత్రి ఇలా కలిసిపోతూ..

 ఫొటోలు: సిఎం ఇందిరమ్మ బాట ఇలా..

ఇందిరమ్మ అమృత హస్తం కేంద్రంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి...

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+