ఫొటోలు: ఉద్వేగానికి గురైన ఆమె, మంత్రి ఫిర్యాదు
తిరువనంతపురం: కేరళ అటవీ శాఖ మంత్రి కెబి గణేష్ కుమార్, ఆయన భార్య డాక్టర్ యామిని విడాకుల వివాదం అత్యంత దారుణమైన మలుపు తీసుకుంది. యామిని మీడియా సమావేశం ఏర్పాటు చేసి తన భర్త గణేష్ కుమార్ తనపై గృహ హింసకు పాల్పడ్డాడని ఆరోపించడంతో వివాదం మలుపు తిరిగింది. దాంతో గణేష్ కుమార్ తన మంత్రి పదవికి రాజీనామా చేసారు.
యమునకు, గణేష్ కుమార్‌కు మధ్య వివాదంలో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత గణేష్ కుమార్ ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తన భార్య తనను చిత్రహింసలు పెట్టిందని ఆరోపిస్తూ నెత్తురోడుతున్న ముఖం ఛాయాచిత్రాలను సమర్పించారు. ఈ మేరకు గణేష్ కుమార్ తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.
సాయంత్రం ఐదున్నర గంటలకు యామిని తన భర్త ఇంట్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి తాను గృహహింస బాధితురాలిని అని, పెళ్లి చేసుకున్నప్పటి నుంచి తన భర్త తనను శారీరక హింసకు గురి చేస్తున్నాడని ఆమె ఆరోపించారు.

తన భర్త గణేష్ కుమార్‌పై ఆరోపణలు చేయడానికి మీడియా సమావేశం ఏర్పాటు చేసే ముందు యామిని అత్యంత ఉద్వేగానికి గురయ్యారు.

తాను గృహహింస బాధితురాలినని గణేష్ కుమార్ భార్య డాక్టర్ యామిని తంకంచి చెప్పారు.

తన భర్త గణేష్ కుమార్ తనను విపరీతంగా కొట్టాడని, దాంతో ఫ్రాక్చర్ కూడా అయిందని యామిని ఆరోపించారు.

తన మిత్రురాలితో మాట్లాడుతున్న యామిని...

ఆనందంగా ఉన్న రోజుల్లో యామిని, గణేష్ కుమార్ ఇలా...
తన భర్త కొట్టడంతో తన కాలు, చేయి ఫ్రాక్చర్ అయ్యాయని ఆమె చెప్పారు. తన మిత్రురాలితో తన భర్తకు వైవాహికేతర సంబంధం ఏర్పడిన తీరును ఆమె వివరించారు. తన స్నేహితురాలి భర్త తన భర్త గణేష్ కుమార్‌ను కలవడానికి వచ్చాడని, మంత్రితో తన భార్యకు వైవాహికేతర సంబంధం ఉందని తెలిసి అతను వచ్చాడని ఆమె చెప్పారు. ఆ వైవాహికేతర సంబంధం గురించి తనకు అలా తెలిసిందని ఆమె వివరించారు.
ఆ వ్యక్తి వెళ్లిపోయిన తర్వాత గణేష్ కుమార్ తన కార్యాలయం గది తలుపులు మూసేసి తనను విపరీతంగా కొట్టాడని ఆమె ఆరోపించారు. ఇరువురు పరస్పర అంగీకారంతో విడాకుల పత్రాలపై ఇటీవల సంతకాలు చేశారు. విడాకుల పత్రాలపై సంతకాలు చేసిన తర్వాత తన ఖాతాలో డబ్బులు జమ చేస్తారని, తన భర్త తన పేరు మీద ఇంటిని రాసిస్తాడని ఆశించానని, అయితే ముఖ్యమంత్రితో పాటు ఇతరులు తనను మోసం చేశారని అర్థమైందని ఆమె అన్నారు.
-
ముఖానికే కాదు అక్కడ కూడా మేకప్ వేసుకోవాలన్నారు..! -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!! -
న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా"












Click it and Unblock the Notifications