జగన్, బాబులకంటే ఎక్కువ: బైరెడ్డి, కెసిఆర్‌పై టిజి సెటైర్

రాయలసీమ ప్రాంతానికి చెందిన 42 రాజకీయ కుటుంబాలను కూకటివేళ్లతో పెకిలించాలని ఆయన అన్నారు. రాయలసీమ ప్రజలను రాయలసీమ హక్కులు, రాష్ట్రం కోసం తాను చైతన్యపరుస్తానని చెప్పారు. అందు కోసం ఈ నెల 13వ తేది నుండి ట్రాక్టర్ పాదయాత్ర చేపట్టనున్నట్లు చెప్పారు.
కెసిఆర్ పైన టిజి వెంకటేష్ సెటైర్
తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎన్ని అవతారాలు ఎత్తినా తెలంగాణ అసాధ్యమని చిన్న నీటి పారుదల శాఖ మంత్రి టిజి వెంకటేష్ శుక్రవారం కర్నూలు జిల్లాలో అన్నారు. పదేళ్లుగా కెసిఆర్ దశావతారాలు ఎత్తారని, ఇప్పుడు నరసింహావతారం ఎత్తినా ఫలితం ఉండదన్నారు. ఉద్యమం పేరుతో అవతారాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు.
షర్మిలపై మంత్రి పార్థసారథి
ముఖ్యమంత్రి కాలర్ పట్టుకోవాలన్న వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల వెంటనే కిరణ్‌కు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని మంత్రి పార్థసారథి డిమాండ్ చేశారు. వారి వ్యాఖ్యలు జమీందారీ పెత్తనానికి నిదర్శనంగా కనిపిస్తున్నాయన్నారు.












Click it and Unblock the Notifications