ఎన్టీఆర్ ఫోటోని టిడిపి తప్ప వాడుకోవచ్చు: కొడాలి నాని

ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర రెడ్డిలను పేద ప్రజలు గుండెల్లో పెట్టుకొని కొలుస్తున్నారని చెప్పారు. అలాంటి ఉత్తమ నాయకులను ఎవరైనా అభిమానిస్తారని చెప్పారు. చంద్రబాబు నాయుడు వంటి నీచుడి డైరెక్షన్‌లో కొన్ని పిచ్చికుక్కలు మొరుగుతున్నాయని మండిపడ్డారు. అవాకులు చవాకులు మానకపోతే బాబు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. ఎన్టీఆర్ బొమ్మను ఒక్క టిడిపి తప్ప ఎవరైనా వాడుకోవచ్చన్నారు.
కాగా, గుడివాడలో ఓ ఫ్లెక్సీలో నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జీ రావి వెంకటేశ్వర రావు ఫోటోను ఫ్లెక్సీలో నుండి కత్తిరించిన అంశం వివాదం రేపిన విషయం తెలిసిందే. టిడిపి నేతలతో రావి వర్గం ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. ఈ ఫ్లెక్సీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి చెందిన థియేటర్ ఎదుట ఉంది. ఇందులో రావి ఫోటోను కత్తిరించారు. వైయస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్ర శనివారం గుడివాడకు చేరుకుంటుంది. ఇదే సమయంలో ఫ్లెక్సీ చిచ్చు రాజుకుంటుండటం ఇరు వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.
టిడిపి ఫ్లెక్సీలో తమ నేత ఫోటోను కొడాలి నాని వర్గీయులే కత్తిరించి ఉంటారని రావి వెంకటేశ్వర రావు వర్గం ఆరోపిస్తోంది. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఫోటో పెట్టుకోవడం వల్ల షర్మిల పాదయాత్రకు ప్రజలు వస్తున్నారని, ఆయన ఫోటో తీసి అప్పుడు వచ్చే జనాన్ని చూపించాలని రావి వెంకటేశ్వర రావు సవాల్ విసిరారు. కొడాలి నాని చీఫ్ ట్రిక్ మానుకోవాలని హితబోధ చేశారు.












Click it and Unblock the Notifications