ఢిల్లీ గ్యాంగ్ రేప్: నిందితుడ్ని కొట్టి చేయి విరగొట్టారు

పరీక్ష రాయకుండా వినయ్ శర్మ కుడిచేయిని విరగ్గొట్టారని ఆయన ఆరోపించారు. క్లర్క్ పోస్టుల భర్తీకి ఈ నెల 7వ తేదీన జరిగే ఐఎఎఫ్ పరీక్షకు అతను హాజరు కావాల్సి ఉంది. "పరీక్ష రాస్తావా, పరీక్ష కుడి చేత్తో రాస్తావు కదా. నీ చేయిని విరగ్గొడుతాం" అంటూ జైలులోని ఖైదీలు విపరీతంగా వినయ్ శర్మను కొట్టారని అతని తరఫు న్యాయవాది ఎపి సింగ్ కోర్టుకు వివరించారు.
సంఘటన గురించి వివరించడానికి జైలు సూపరింటిండెంట్‌ను కోర్టుకు రప్పించాలని ఆయన కోరారు. విచారణను మరో చోటికి మార్చాలని, వినయ్ శర్మను ఢిల్లీ పోలీసులకు దూరంగా ఉంచాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
జైలు సూపరింటిండెంట్‌ను కోర్టుకు పిలవాలని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దయన్ కృష్ణన్ కూడా కోరారు. ఇది తనను ఇబ్బంది పెడుతోందని, విచారణ నిజాయితీగా జరిగేలా చూడాల్సిన బాధ్యత తనదని, ఈ సంఘటనతో తాను తీవ్ర ఆందోళనకు గురయ్యానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications