ప్రేమకు యువతి బలి: భార్య గొంతు కోసిన భర్త

Nalgonda District
నల్లగొండ/ఒంగోలు/శ్రీశైలం: నల్లగొండ జిల్లాలో ప్రేమ వేధింపులకు ఓ యువతి బలైంది. నల్లగొండ జిల్లా నూతనకల్ మండలం టి. కొత్తపల్లిలో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ప్రేమ వేధింపుల కారణంగానే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని ఆమె తల్లిదండ్రులు ఓ యువకుడిపై పోలీసులకు పిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ప్రకాశం జిల్లా చీరాలలో దారుణం జరిగింది. చీరాలలోని రాంనగర్ న్యూకాలనీలో భార్య కాపురానికి రావడం లేదని ఆగ్రహగించిన భర్త ఆమె గొంతు కోశాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన భార్యను ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. భర్తకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడిని అదుపులోకీ తీసుకున్నారు.

శ్రీశైలం పాతాళగంగలో మునిగిపోయి ఓ భక్తుడు మరణించాడు. పాతాళగంగలో పుణ్యస్నానం చేసేందుకు వెళ్లిన ఓ భక్తుడు ప్రమాదవశాత్తు కాలుజారి నీటిలో మునిగిపోయాడు. మృతుడిని కర్ణాటకకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.

ఇదిలావుంటే, చిత్తూరు జిల్లా కాళహస్తిలోనే ఓ వ్యక్తి ఉరేసుకుని మరణించాడు. ఖమ్మం జిల్లాకు చెందిన శ్రీరంగనాయుడు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల భాధను తట్టుకోలేక అతను అత్మబలిదానానికి పూనుకున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+