ఆమె లుక్స్‌పై వ్యాఖ్యతో దుమారం: ఒబామా క్షమాపణ

Barack Obama
వాషింగ్టన్: కాలిఫోర్నియాకు చెందిన టాప్ లాయర్‌ చూపులపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ద గుడ్ లుకింగ్ అటార్నీ జనరల్ అంటూ ఆయన కమలా హరీష్‌పై వ్యాఖ్యానించారు. ఈ వారంలో ఒబామా, కమలా హరీష్ కలిసి ఓ నిధుల సమీకరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన ఆ వ్యాఖ్య చేశారు.

ఒబామా వ్యాఖ్యలను సోషల్ మీడియాలో తప్పు పడుతూ వ్యాఖ్యలు చేసారు. అమెరికాలో ఇప్పటికీ మహిళలు పని చేసే క్రమంలో ఎదుర్కుంటున్న ఇబ్బందులకు ఒబామా వ్యాఖ్య అద్దం పడుతోందంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఒబామా క్షమాపణ చెప్పారు.

ఒబామాతో కమలా హరీష్ మాట్లాడారని, ఒబామాను ఆమె బలపరుస్తోందని, ఒబామా క్షమాపణను ఆమె అంగీకరించారా లేదా అనేది తెలియదని కమలా హరీష్ అధికార ప్రతినిధి చెప్పారు. గురువారం రాత్రి ఫోన్ చేసి ఒబామా క్షమాపణలు చెప్పారని శ్వేత సౌధం ప్రెస్ సెక్రటరీ జయ్ కార్నే చెప్పారు.

ఒబామా మాట్లాడుతూ ఆ వ్యాఖ్యలు చేయడానికి ముందే సిలికాన్ వ్యాలీలో జరిగిన కార్యక్రమంలో కమలా హరీష్ ప్రసంగించారు. వారిద్దరు చాలా పాత మిత్రులని కార్నేతో పాటు హరీష్ అధికార ప్రతినిధి గిల్ డురాన్ కూడా చెప్పారు. అటార్ని జనరల్ వృత్తి నైపుణ్యాన్ని గానీ, సామర్థ్యాన్ని గానీ తక్కువ చేసే చూపే ఉద్దేశం తనకు లేదని ఒబామా చెప్పినట్లు కార్నే శుక్రవారం తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+