వివాదాల్లోకి లాగొద్దు, నాది నందమూరి రక్తమే: ఎన్టీఆర్

Jr Ntr
హైదరాబాద్: తనకు సంబంధం లేని వివాదాల్లోకి తనను లాగవద్దని నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ సోమవారం రాత్రి అన్నారు. ఆయన బాద్ షా విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫ్లెక్సీ రాజకీయాలపై స్పందించారు. అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ తనది ఒకే మాట అని, తాను ఎప్పుడు తన తాతయ్య స్వర్గీయ నందమూరి తారక రామారావు స్థాపించిన పార్టీకి అండగా ఉంటానని చెప్పారు.

తన వంట్లో నందమూరి రక్తం ప్రవహిస్తోందని, తాత ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకే కట్టుబడి కట్టుబడి ఉంటానన్నారు. అయితే, ఫ్లెక్సీల రాజకీయాలపై ఆయన సూటిగా స్పందించలేదు. కానీ, తనకు సంబంధం లేని వివాదాల్లోకి తనను లాగవద్దని చెప్పారు. ప్రస్తుతం తాను బాద్ షా సినిమా పెద్ద హిట్ అయిన ఆనందాన్ని ఆస్వాదిస్తున్నానని చెప్పారు. దయచేసి ఇలాంటి సమయాల్లో వివాదాల్లోకి లాగవద్దన్నారు.

ఆనందాన్ని ఆస్వాదిస్తున్న సమయంలో దానిని దూరం చేయవద్దన్నారు. తన అభ్యున్నతికి కారణమైన తన తాతగారు స్థాపించిన పార్టీకే అండదండగా ఉంటానన్నారు. మీరు ఎలా అర్థం చేసుకున్నా.... తాను పదే పదే మాత్రం ఈ విషయాన్ని చెప్పనని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు.తన ఒంట్లో నందమూరి రక్తముందన్నారు.

కాగా, ఇటీవల ఫ్లెక్సీ రాజకీయాలపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ ఫోటోను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వినియోగించడంపై అంతకుముందు హరికృష్ణ మాట్లాడుతూ ఇది తన తనయుడికి సంబంధం లేని విషయమని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+