పోలీసుల్లో టిడిపి ఏజెంట్లు: దానం, నాగంపై అరుణ భర్త

పోలీసుల ఆరోపణలను తాను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్తానని చెప్పారు. బడుగు నేతలు ఎదగడాన్ని తెలుగుదేశం పార్టీ జీర్ణించుకోలేకపోతుందన్నారు. హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిపై పెట్టిన ఛార్జీషీటులో ఏముందో తనకు తెలియదని, అది తెలియకుండా తాను మాట్లాడనని చెప్పారు. మజ్లిస్‌తో పొత్తు విషయం తమ పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు. తాను, మంత్రి ముఖేష్ గౌడ్‌లం తెలంగాణకు ఎప్పుడు వ్యతిరేకం కాదన్నారు.
అన్నింటికి సమాధానం చెప్పం!: పొన్నాల
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తమ ఉనికిని కాపాడుకునేందుకే మంత్రులపై విమర్శలు గుప్పిస్తున్నారని ఐటి శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. మంచిని చూసి ఓర్వలేకనే చంద్రబాబు విమర్శలు చేస్తున్నారన్నారు. కోల్పోయిన పార్టీ ప్రతిష్టను కాపాడుకునేందుకే తమను విమర్శిస్తున్నారన్నారు. విపక్షాల అన్నింటికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నారు.
నాగం బియ్యం రెడ్డి: డికె అరుణ భర్త భరతసింహా రెడ్డి
నాగర్ కర్నూలు ఎమ్మెల్యే, తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు నాగం జనార్ధన్ రెడ్డి శిఖండిలా వ్యవహరిస్తున్నారని మంత్రి డికె అరుణ భర్త భరతసింహా రెడ్డి విమర్శించారు. నాగంకు బియ్యం రెడ్డిగా పేరు ఎందుకు వచ్చిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. తన వ్యాపారాలతో తన భార్య డికె అరుణకు ఎలాంటి సంబంధం లేదన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు బాణాసంచా కాల్చిన వారే ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో నేతలుగా ఉన్నారన్నారు. తాను కాంట్రాక్టర్‌ను అని చెప్పారు. నాగం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలతో కలిసి మీడియా సమావేశం ఎందుకు పెట్టారో చెప్పాలన్నారు. తన క్రషర్ లోనికి నీలి కిరోసిన్ ఎలా వచ్చిందో తెలియదన్నారు.












Click it and Unblock the Notifications