హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బంగారంతో కస్టమ్స్‌ అధికారులకు చిక్కిన టెక్కీ

By Pratap
|
Google Oneindia TeluguNews

NRI techie nabbed with gold at RGI airport
హైదరాబాద్: కస్టమ్స్ అధికారులు మంగళవారం హైదరాబాద్‌కు చెందిన 45 ఏళ్ల ఎన్నారై టెక్కీని శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. దాదాపు 551 గ్రాముల బంగారాన్ని స్మగుల్ చేయడానికి ప్రయత్నించినందుకుగాను అతన్ని అరెస్టు చేశారు.

సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ సౌదీ ఎయిర్‌లైన్స్ విమానంలో మంగళవారం ఉదయం రియాద్ నుంచి వచ్చాడు. కస్టమ్స్ చెక్ పాయింట్ వద్ద అధికారులు చేతి సంచీలో దాచిన 551 గ్రాముల 24 బంగారం బిస్కట్లను కనిపెట్టారు. ఎన్నారై తన భార్య, ముగ్గురు పిల్లలతో హైదరాబాద్ వచ్చాడు.

ఎన్నారై కుటుంబ సభ్యులు పెద్ద యెత్తున సామాన్లు తెచ్చారని, బంగారాన్ని కార్బన్ పేపర్‌లో చుట్టి, చేతి సంచీలోని దుస్తుల కింద పెట్టారని అధికారులు చెప్పారు. అధికారులు స్వాధీనం చేసుకున్న బంగారం మార్కెట్ విలువ 17 లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దానిపై కస్టమ్స్ డ్యూటీ 1.7 లక్షల రూపాయలు ఉంటుంది.

కస్టమ్స్ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద ఎన్నారై టక్కీపై కేసులు నమోదు చేశారు. అతన్ని కోర్టులో ప్రవేశపెట్టారు. ఆ తర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. కస్టమ్స్ సుంకంతో పాటు జరిమానా కింద ఆ ఇంజనీర్ 3 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు.

English summary
A 45-year-old NRI from the city was arrested by customs sleuths on Tuesday for trying to smuggle in 551 grams of gold through the RGI airport.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X