విజయ్ మాస్ట్రర్ స్ట్రోక్..! కీలక షరతుతో కాంగ్రెస్ లాక్ ..!

తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాజకీయ పండితుల అంచనాల్ని తారుమారు చేస్తూ ఘన విజయం సాధించిన టీవీకే (TVK) అధినేత విజయ్ (Vijay).. ఇప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధవుతున్నారు. అయితే ఇందులో ఆయన వేస్తున్న అడుగులు చాలా వ్యూహాత్మకంగా ఉన్నాయి. భవిష్యత్తు రాజకీయాల్ని దృష్టిలో ఉంచుకుని ఆయన ప్రభుత్వంలో భాగస్వాముల్ని చేర్చుకునేందుకు విజయ్ ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ తో పొత్తును (tvk-congress) విజయ్ కీలకంగా భావిస్తున్నారు.

అందుకే కాంగ్రెస్ తో కుదిరిన మద్దతు ఒప్పందంలో విజయ్ ఓ కీలక అంశాన్ని చేర్చారు. అదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ తో పొత్తు ప్రభుత్వ ఏర్పాటుకు పరిమితం కాదని, భవిష్యత్తులో జరిగే అన్ని ఎన్నికలకూ వర్తిస్తుందంటూ విజయ్ తేల్చిచెప్పేశారు. కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన ప్రకటనలో ఉన్న ప్రకారం " రెండు పార్టీల మధ్య పరస్పర గౌరవం, సముచిత వాటా మరియు ఉమ్మడి బాధ్యతపై ఆధారపడిన ఈ కూటమి, ఈ ప్రభుత్వ ఏర్పాటు కోసమే కాకుండా, భవిష్యత్తులో స్థానిక సంస్థలు, లోక్‌సభ మరియు రాజ్యసభలకు జరిగే ఎన్నికల కోసం కూడా ఉద్దేశించబడింది." అని తెలిపారు.

Vijay s Master Stroke TVK-Congress Tie-Up Not Just for Tamil Nadu Govt But All Future Elections

దీని ఉద్దేశం కేవలం తన ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ మీద ఆధారపడ్డాననే అపవాదు లేకుండా భవిష్యత్తులో అన్ని ఎన్నికల్లోనూ తమ పొత్తు కొనసాగుతుందని విజయ్ తేల్చిచెప్పేసినట్లయింది. అందుకే విజయ్ టీమ్ ఎక్స్ లో చేసిన పోస్టులోనూ ఈ వ్యాఖ్యల్ని ప్రత్యేకంగా ట్వీట్ చేసింది. భవిష్యత్తులో తమిళ రాజకీయాల్లో డీఎంకే కూటమికి ప్రత్యామ్నాయంగా ఎదగాలని టార్గెట్ పెట్టుకున్న విజయ్.. వ్యూహాత్మకంగానే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. అందుకే కేంద్రం, రాష్ట్రాల్లో, స్థానిక సంస్థల్లోనూ ఇరు పార్టీలు పొత్తు కొనసాగించాలని కండిషన్ పెట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+