ఫ్లెక్సీలు ప్రచారానికే కావచ్చు, టిడిపితోనే: జూ.ఎన్టీఆర్

Jr Ntr
హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ తన బొమ్మతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకూడదని నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ అనుకుంటున్నట్లు చెబుతున్నారు. కొంత మంది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనను కలిసిన సమయంలో ఆయన ఆ విషయంపై మాట్లాడినట్లు వార్తలు వస్తున్నాయి.

పార్టీ అధినాయకత్వం కోరితే వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున ప్రచారం చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఎన్టీఆర్ చెప్పినట్లు సమాచారం. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల వ్యవహారం ఇటీవల తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టించిన నేపధ్యంలో కొందరు టిడిపి నేతలు కొద్ది రోజుల క్రితం ఇక్కడ ఆయనను కలిసి తాజా పరిణామాలపై మాట్లాడారు. ఇటీవలి పరిణామాలన్నీ వారి మధ్య చర్చకు వచ్చినట్లు చెబుతున్నారు.

స్వర్గీయ ఎన్టీ రామారావు పెట్టిన పార్టీకి తాను దూరమయ్యే పరిస్ధితే లేదని, ఆ విషయంలో ఎవరూ ఎటువంటి అనుమానాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని, పార్టీ కోరితే ఎన్నికల్లో ప్రచారానికి కూడా తాను సిద్ధంగా ఉన్నానని ఆయన వారితో అన్నట్లు వార్తలు వచ్చాయి.

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందినవారు ఇటీవల కోస్తా ప్రాంతంలో అక్కడక్కడా వారి ఫ్లెక్సీలపై తన ఫొటోను వాడుకోవడం కేవలం ప్రచారం కోసం చేసిన వ్యవహారం అని తాను అనుకొంటున్నానని, తను దానికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వదల్చుకోలేదని ఆయన చెప్పారని సమాచారం.

ఫ్లెక్సీల్లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు తన బొమ్మను వాడుకోవడంపై వివరణ ఇవ్వకుండానే తాను టిడిపితోనే ఉంటానని, తనను వివాదాల్లోకి లాగవద్దని ఆయన ఇటీవల బాద్‌షా సక్సెస్ మీట్‌లో చెప్పిన విషయం తెలిసిందే. ఇవే మాటలను ఆయన తెలుదేశం పార్టీ నాయకులతో చెప్పినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+