300 మిగిలేవి, అప్పుడే ఉగాది: కిరణ్‌పై షర్మిల ఎద్దేవా

Sharmila
విజయవాడ: మళ్లీ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి పాలన వచ్చినప్పుడే ప్రజలకు అసలైన ఉగాది అని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల అన్నారు. ఆమె మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర కృష్ణా జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు.

పెరిగిన ధరలు, కరెంటు ఛార్జీలతో రాష్ట్రంలో ప్రజలు బతకడమే కష్టంగా మారిందని, ఉగాది వచ్చినా ప్రజలు పండుగలా జరుపుకునే పరిస్థితి లేదన్నారు. వైయస్ బతికి ఉంటే ఇప్పుడు నెలకు 20 కిలోలకు బదులు 30 కిలోల బియ్యం ఇచ్చే వారని, ప్రభుత్వం మాత్రం ఇరవయ్యే ఇస్తుందని విమర్శించారు. మరో పది కిలోల బియ్యం బయట కొనుక్కోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. వైయస్ బతికి ఉంటే ప్రజలకు నెలకు రూ.300 మిగిలేవన్నారు. కిరణ్ కుమార్ రెడ్డి మాత్రం అమ్మ హస్తం పేరుతో జిమ్మిక్కులు చేస్తున్నారన్నారు.

కిలో బియ్యాన్ని రూ.1కి తగ్గించడం వల్ల ఆయన ఏడాదికి రూ.240 మాత్రమే మిగుల్చుతున్నారని వైయస్ ఉంటే నెలకే రూ.300 మిగిలేవన్నారు. ఈ కాంగ్రెసు ప్రభుత్వం అధికారంలో ఉండేందుకు వీలు లేదన్నారు. ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉండటంతో ప్రభుత్వం అమ్మహస్తం పథకాన్ని ప్రవేశ పెట్టడం ఓ జిమ్మిక్కు అన్నారు. ప్రజలు ఆయనకు పిచ్చివాళ్లలా కనిపిస్తున్నారా అని మండిపడ్డారు.

ఈ ప్రభుత్వానికి ఆయుష్షు ఎక్కువ లేదని, విద్యుత్ ఛార్జీల పేరుతో ఏకంగా రూ.32వేల కోట్ల భారం వేసి ప్రజల రక్తం పిండుతోందన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు నెత్తిన పెట్టుకొని కాపాడుతున్నారని ధ్వజమెత్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+