చంద్రబాబుకు మరో షాక్: తెరాసలోకి ఎమ్మెల్యే గంగుల

Gangula Kamalakar
హైదరాబాద్/కరీంనగర్: కరీంనగర్ జిల్లా తెలుగుదేశం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరనున్నారు. పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు తెలంగాణ నుండి చాలా రోజుల తర్వాత మరో షాక్ గంగుల రూపంలో తగులుతోంది. తాను తెరాసలో చేరనున్నట్లు గంగుల సోమవారం చెప్పారు. తాను కెసిఆర్‌‍ను కలిసేందుకు గజ్వెల్ వెళ్తున్నానని చెప్పారు. తెలుగుదేశం పార్టీలో ఉండి పోరాడితే సమైక్యవాదులుగానే చూస్తున్నారన్నారు. తెరాసతోనే తెలంగాణ సాధ్యమని ఆయన అన్నారు.

అంతకుముందు కమలాకర్ ఈ రోజు ఉదయం కరీంనగర్ జిల్లాలో తన నియోజకవర్గం కార్యకర్తలతో భేటీ అయ్యారు. తెరాసలో చేరికపై వారితో చర్చించారు. మీరు ఎక్కడుంటే తాము అక్కడుంటామని, అండగా నిలబడతామని కార్యకర్తలు గంగుల కమలాకర్‌కు హామీ ఇచ్చినట్లుగా సమాచారం. దీంతో ఆయన అతను తెరాసలో చేరేందుకు సిద్దమయ్యారు.

గంగుల సాయంత్రం లేదా రేపు ఉదయం ప్రకటన చేస్తారనే ప్రచారం జరిగింది. మరోవైపు కరీంనగర్ నుండి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఆయనకు మద్దతుగా హైదరాబాద్ తరలి వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన హైదరాబాదులోనే ప్రకటన చేయనున్నారని తెలుస్తోంది.

నారదాసుకు కెసిఆర్ బుజ్జగింపు

గంగుల కమలాకర్ తెరాసలోకి వస్తుండటంతో అదే స్థానంపై ఆశలు పెట్టుకున్నా మాజీ శాసన మండలి సభ్యుడు నారదాసు లక్ష్మణ రావు అలకబూనారు. తెరాస అధ్యక్షుడు, మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఆయనను బుజ్జగిస్తున్నారు. గంగుల కమలాకర్ రాకను అడ్డుకోవద్దని ఆయన నారదాసుకు సూచించినట్లుగా సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+