వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జగన్‌కు ఉరేస్తే మంత్రులకూ: సిపిఎం, వైఎస్ వల్లే: పితాని

By Srinivas
|
Google Oneindia TeluguNews

Raghavulu
నెల్లూరు/హైదరాబాద్: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ఉరిశిక్ష వేయాల్సిన పరిస్థితే వస్తే అంతకుముందు మంత్రులను ఉరి తీయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి నారాయణ సోమవారం అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అవినీతి మంత్రులను కాపాడుతున్నారని మండిపడ్డారు.

ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను సక్రమంగా వినియోగిస్తారనే నమ్మకం తమకు లేదన్నారు. ప్రభుత్వం బలహీనంగా ఉన్నా గద్దె దించలేని పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఉన్నాయని విమర్శించారు. స్థానిక సంస్థళ ఎన్నికల షెడ్యూలును వెంటనే ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. అవినీతి మంత్రులను కాపాడవద్దన్నారు.

తెర వెనుక ఒప్పందాల వల్లే కష్టాలు... పితాని

తెర వెనుక ఒప్పందాల వల్లే తమ మంత్రులకు కష్టాలు వచ్చాయని మంత్రి పితాని సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. వైయస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రులు చెప్పిందే మంత్రులు చేశారని ఆయన అన్నారు. మంత్రులు తమ తమ కేసులను న్యాయపరంగా ఎదుర్కొంటారని చెప్పారు.

చేసిన పనికి వైయస్ జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాల్సింది పోయి కాంగ్రెసు పార్టీపై బురద జల్లజమేమిటని ప్రశ్నించారు. ఇది చాలా విచారకరమన్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేస్తున్న షర్మిల సిబిఐ పైన, కాంగ్రెసు పైన అర్థరహిత ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు.

షర్మిలది రాజకీయ దివాళాకోరుతనం.. గండ్ర

తమ పార్టీ ఎంపీలు జీనియస్‌లు అని ఎవరి ట్రాప్‌లో పడరని ప్రభుత్వం చీఫ్ విఫ్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. అమ్మ హస్తంపై షర్మిల వ్యాఖ్యలు రాజకీయ దివాళాకోరుతనం అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తేనే మనుగడ ఉంటుందనే భ్రమను విపక్షాలు వీడాలన్నారు. చంచల్‌గూడ జైలు జగన్ పార్టీకి రిసెప్షన్‌లా మారిందనే విమర్శలు వస్తున్నాయని, దీనిపై విచారణ జరిపించాలన్నారు. జగన్‌‌కు ఫోన్ మంతనాలు, ములాకత్‌లు ఉన్నాయనే విమర్శలు వస్తున్నాయన్నారు.

కళంకిత మంత్రులను కాపాడుతున్నారు.. అశోక గజపతి రాజు

కళంకిత మంత్రులను ముఖ్యమంత్రి కాపాడుతున్నారని టిడిపి నేత అశోక గజపతి రాజు మండిపడ్డారు. మంత్రులు వెంటనే రాజీనామా చేయాలన్నారు.

English summary
CPM state secretary Raghavulu has said ministers should hang if YS Jaganmohan Reddy will hang.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X