ఫొటోలు: జూనియర్ ఎన్టీఆర్‌కు నందమూరి బ్రదర్స్ సెగ

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీలో నెలకొన్న వారసత్వపోరులో నందమూరి కుటుంబ సభ్యులు రెండుగా చీలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. చాలా కాలం మౌనంగా ఉన్న నందమూరి హీరోలు తారకరత్న, కళ్యాణ్ రామ్ తెర మీదికి వచ్చారు. వీరిద్దరు కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడదికి మద్దతు పలికారు. బాబాయ్ బాలయ్య వైపు వారు మొదటి నుంచీ మొగ్గు చూపుతున్నారు. అయితే, నందమూరి హరికృష్ణ కూడా రంగం మీదికి రావడంతో వారు కాస్తా వెనక్కి తగ్గినట్లు కనిపించారు.

తారకరత్న ఇటీవల చంద్రబాబుకు పూర్తి మద్దతు ప్రకటించారు. సీనియర్ ఎన్టీఆర్ వారసుడు చంద్రబాబు నాయుడేనని ఆయన కితాబు ఇచ్చారు. తాజాగా, కళ్యాణ్ రామ్ చంద్రబాబును కలవడం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. హరికృష్ణ అభిమతానికి భిన్నంగా కళ్యాణ్ రామ్ చంద్రబాబుకు మద్దతు ప్రకటించడాన్ని కీలకమైన మలుపుగా భావిస్తున్నారు.

బాలకృష్ణ పూర్తిగా చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నారు. దాంతో బాలకృష్ణను కూడా వ్యతిరేకిస్తూ నందమూరి హరికృష్ణ జూనియర్ ఎన్టీఆర్‌కు మద్దతుగా నిలిచారు. జూనియర్ ఎన్టీఆర్ తాత సీనియర్ ఎన్టీ రామారావు వారసత్వాన్ని సొంతం చేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలకు గండి కొట్టడానికే కళ్యాణ్ రామ్, తారకరత్న చంద్రబాబుకు మద్దతు ప్రకటిస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో వారిద్దరు కూడా బాలయ్యను కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించారు. చంద్రబాబును ప్రస్తుతానికి నిలబెట్టడం ద్వారా బాబాయ్ నాయకత్వానికి పునాదులు వేయాలని వారు ఆలోచిస్తూ ఉండవచ్చుననే మాట వినిపిస్తోంది.

ఫొటోలు: జూ ఎన్టీఆర్‌కు బ్రదర్స్ సెగ

తాజాగా, హీరో కళ్యాణ్‌ రామ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని కలిశారు. నొప్పులతో బాధపడుతూ విశ్రాంతి తీసుకుంటున్న చంద్రబాబును ఆయన పరామర్సించారు. నారా, నందమూరి కుటుంబాల మధ్య జరుగుతున్న పోరులో ఆయన చంద్రబాబుకు పూర్తి మద్దతు ఇస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.

ఫొటోలు: జూ ఎన్టీఆర్‌కు బ్రదర్స్ సెగ

సీనియర్ ఎన్టీఆర్ వారసుడు చంద్రబాబు నాయుడేనని హీరో తారకరత్న ఇటీవల ప్రకటించారు. తెలుగుదేశం పార్టీకి తన మద్దతు ప్రకటించారు.

ఫొటోలు: జూ ఎన్టీఆర్‌కు బ్రదర్స్ సెగ

చంద్రబాబును బలపరుస్తూ కళ్యాణ్ రామ్, తారకరత్న బాబాయ్ బాలకృష్ణకు మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. జూనియర్ ఎన్టీఆర్‌కు, బాలకృష్ణకు మధ్య జరుగుతున్న వారసత్వపు పోరులో వారు బాలకృష్ణ వెంట ఉండడానికే ఇష్టపడుతున్నట్లు అర్థమవుతోంది.

ఫొటోలు: జూ ఎన్టీఆర్‌కు బ్రదర్స్ సెగ

జూనియర్ ఎన్టీఆర్‌కు సీనియర్ ఎన్టీ రామారావు వారసత్వం దక్కకుండా చేయడమే కళ్యాణ్ రామ్, తారకరత్న ప్రయత్నమని అంటున్నారు. ఇందులో భాగంగానే వారు చంద్రబాబుకు మద్దతు ఇస్తున్నట్లు చెబుతున్నారు.

వయసు రీత్యా వారసత్వ పోరులో తారకరత్న గానీ కళ్యాణ్ రామ్ గానీ జానియర్ ఎన్టీఆర్ ముందు ఉండడాన్ని ఇష్టపడబోరని, బాలకృష్ణ ముందుండడాన్నే వారు అంగీకరిస్తారని అంటున్నారు. అందుకే చంద్రబాబుకు వారు పూర్తి స్థాయిలో మద్దతు పలకడానికి సిద్ధపడినట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+