తెరాసలోకి టిడిపి ఎమ్మెల్యేలు?: నారదాసు ఆందోళన

కరీంనగర్ జిల్లా టిడిపి ఎమ్మెల్యేలు తెరాసలో చేరుతారనే ప్రచారం ఆదివారం రాత్రి జోరుగా సాగింది. టివి ఛానళ్లలో ఈ వార్తలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. ప్రధానంగా టిడిపిలో ఆందోళన కలిగించింది. జిల్లా తెరాసలోను కాకరేపింది. కరీంనగర్ అసెంబ్లీ టికెట్‌పై తెరాస మాజీ ఎమ్మెల్సీ, ఆ నియోజకవర్గ పార్టీ ఇంఛార్జి నారదాసు లక్ష్మణరావు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు గంగుల కమలాకర్ పార్టీలోకి వస్తున్నారనే ప్రచారంతో నారదాసు వర్గీయులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
హైదరాబాద్‌లో గడప గడపకు తెలంగాణ కార్యక్రమంలో పాల్గొంటున్న నారదాసు వర్గీయులు ఎడ్ల అశోక్ ఆధ్వర్యంలో హుటాహుటిన పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు నివాసానికి చేరుకున్నారు. ఆ సమయానికి కెసిఆర్ కాంగ్రెసు పార్టీ సీనియర్ నేత కె కేశవ రావు నివాసంలో ఉన్నారు. కొద్ది సేపటికి తిరిగి తన నివాసానికి వచ్చారు. ఆ తర్వాత 7.30 గంటల ప్రాంతంలో వారిని కెసిఆర్ కలిశారు.
టిడిపి ఎమ్మెల్యేల చేరికపై వారు ప్రశ్నించారు. వారు పార్టీలోకి వస్తారని, టిక్కెట్ ఇస్తారని ప్రచారం జరుగుతోందని కెసిఆర్‌ను వారు అడిగారు. ఆయనకు స్థానికంగా మంచిపేరు లేదు. మొదటనుంచి తెరాసలో కష్టపడి పని చేస్తున్న నారదాసు లక్ష్మణ రావుకే పార్టీ టికెట్ ఇవ్వాలన్నారు. దీనికి కెసిఆర్ స్పందిస్తూ సర్వేల ఆధారంగానే పార్టీ టికెట్లు ఇస్తామని, ఇతరత్రా జరుగుతున్న ప్రచారంతో అయోమయానికి గురి కావొద్దని చెప్పారట.
గంగుల కమలాకర్‌ను పార్టీలోకి తీసుకోబోమని, నారదాసుకే అవకాశం ఇస్తామనే స్పష్టమైన హామీ ఇవ్వలేదట. గంగుల కమలాకర్, దేవయ్య కూడా ఈ ప్రచారాన్ని సూటిగా ఖండించలేదు. టిడిపిని వీడి వెళుతున్నట్లు తాము ఎవరికీ చెప్పలేదని, కార్యకర్తలతో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకుంటామని చెప్పారు.
-
'రాత్రి 9 దాటితే నాకు ఆ కోరిక తప్పదు!' -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
గ్యాస్ సిలిండర్ ధరలు మళ్లీ పెంపు, ఈ సారి ఎంత..!? -
వంట గ్యాస్ కొరత వేళ చంద్రబాబు కీలక ఆదేశాలు, రాష్ట్రంలో ఇక నుంచి..!! -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
"గోధుమ రవ్వ ఉప్మా" ఇలా చేస్తే ఇంటిల్లిపాది లొట్టలేయాల్సిందే..! -
నేడు, రేపు ఆకాశంలో ఓ అద్భుతం- డోన్ట్ మిస్ -
'బిడ్డను పెంచడానికి ఆ పనికైనా సిద్ధమే' -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
" ప్లీజ్.. ఆ విషయంలో భారత్ ను అడుక్కుంటున్న అమెరికా " -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే












Click it and Unblock the Notifications