జూ ఎన్టీఆర్ అసంతృప్తి!: బాబును కల్సిన కళ్యాణ్ రామ్

కళ్యాణ్ రామ్ కలయికపై చర్చ
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు నందమూరి హరికృష్ణ తనయుడు కళ్యాణ్ రామ్ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబును కలవడం చర్చనీయాంశమైంది. హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌లు చంద్రబాబు, నందమూరి బాలకృష్ణపై అసంతృప్తిగా ఉన్న విషయం తెలిసిందే.
జూనియర్ ఎన్టీఆర్ విజయవాడ పర్యటన నుండి ప్రారంభమైన రగడ కొనసాగుతోంది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఫ్లెక్సీలలో జగన్‌తో పాటు జూనియర్ ఎన్టీఆర్ బొమ్మను వాడటం చర్చనీయాంశమైంది. దీనిపై జూనియర్ ఇటీవల బాద్ షా చిత్ర విజయవంత వేడుకలో వివరణ ఇచ్చారు. తాను టిడిపితోనే ఉంటానని చెప్పారు. అయితే, అంతకుముందు హరికృష్ణ చెప్పాల్సింది ఎంతో ఉందని భిన్నంగా స్పందించారు. దీంతో జూనియర్, హరికృష్ణలు అసంతృప్తితో ఉన్నట్లు బట్టబయలైంది.
అయితే హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అసంతృప్తితో ఉండగా కళ్యాణ్ రామ్ మాత్రం చంద్రబాబుకు పూర్తిగా మద్దతు పలకడం గమనార్హం. నాలుగు రోజుల క్రితం మరో నందమూరి హీరో తారక రత్న కూడా తమ నాయకుడు చంద్రబాబేనని, బాబాయ్, జూనియర్ ఎన్టీఆర్, తారకరత్న, తాను అందరం కార్యకర్తమని చెప్పారు.












Click it and Unblock the Notifications