వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జూ. ఎన్టీఆర్ బొమ్మ: మారని జగన్ పార్టీ తీరు అదే

By Pratap
|
Google Oneindia TeluguNews

YSRCP again uses Jr NTR iamge
తిరుపతి: తమ పార్టీ ఫ్లెక్సీల్లో నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మను వాడుకోవడాన్ని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కొనసాగిస్తూనే ఉంది. తాజాగా, చిత్తూరు జిల్లా చంద్రగిరిలో తమ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌ బొమ్మతో పాటు జూనియర్ ఎన్టీఆర్ బొమ్మను ముద్రించింది.

చిత్తూరు జిల్లా చంద్రగిరిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఇన్‌చార్జి చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి నేతృత్వంలో ఆదివారం జరిగిన ఒక సభలో జూనియర్ ఎన్‌టిఆర్ కటౌట్లు, బ్యానర్లు ప్రత్యక్షమైయ్యాయి. ఇది తెలుగుదేశం పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. జూనియర్ ఎన్టీఆర్ వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరతారనే ప్రచారం జరగడం, అలాంటిది ఏమి లేదని ఆయన ఖండించడం పాఠకులకు విదితమే.

అయితే తాజాగా ఆదివారం చంద్రబాబు సొంత మండలమైన చంద్రగిరిలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సభలో జూనియర్ ఎన్టీఆర్ బొమ్మలు కనిపించాయి. ఈ సభకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కరుణాకర్‌రెడ్డి విచ్చేశారు. ఈ సభ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలున్న కటౌట్లను, ఫొటోలను కొంత మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు ఏర్పాటు చేశారు.

ఈ విషయాన్ని ఇప్పటికే కొంతమంది తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. అయితే టిడిపిలో అయోమయం సృష్టించడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు చేస్తున్న కుట్రగా తెలుగుదేశం పార్టీ నాయకులు కొట్టేసే ప్రయత్నాలు చేస్తున్నారు.

English summary
YS Jagan's YSR COngress party leaders are continuing to use Jr NTR images in their party cut outs. Chittoor district YSR Congress party has used Jr NTR images in sunday party meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X