ఆఖరి పోరాటమే, జగ్గారెడ్డిది నా స్థాయి కాదు: వివేక్

Vivek
హైదరాబాద్/నల్గొండ: తెలంగాణ కోసం ఇక తాము ఆఖరి పోరాటం చేస్తామని కరీంనగర్ జిల్లా పెద్దపల్లి కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు జి.వివేక్ మంగళవారం అన్నారు. రెండో దఫా జరగనున్న పార్లమెంటు సమావేశాల సమయంలో తెలంగాణపై అధిష్టానం మీద మరోసారి ఒత్తిడి తీసుకు వస్తామన్నారు.

పార్లమెంటు సమావేశాలలో తాము తెలంగాణవాదం వినిపిస్తామని చెప్పారు. బడ్జెట్ సమావేశాల తర్వాత కూడా అధిష్టానం నుండి ఎలాంటి నిర్ణయం రాకుంటే తాము కీలక నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తాము సరైన దారిలోనే వెళ్తామని, రాజీపడే ప్రసక్తే లేదన్నారు.

ప్రభుత్వ విప్, సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి(జగ్గారెడ్డి)కి తనను విమర్శించే స్థాయి లేదని వివేక్ అన్నారు. తనపై జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలకు స్పందించనని చెప్పారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆదేశాల మేరకే జగ్గారెడ్డి తన పైన విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. తన మీద వచ్చిన అవినీతి ఆరోపణల విషయమై మాట్లాడుతూ... ఎలాంటి విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

బిజెపి తెలంగాణ ఇస్తుంది: వెంకయ్య

ప్రాంతీయ పార్టీలతో సమర్థ పాలన సాధ్యం కాదని జాతీయ పార్టీలతోనే అవుతుందని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత వెంకయ్య నాయుడు నల్గొండ జిల్లాలో అన్నారు. కాంగ్రెసు వల్లే దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు హెచ్చుమీరుతున్నాయని ఆరోపించారు. తెలంగాణ ఇచ్చేది బిజెపి మాత్రమే అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో తెలంగాణ ఇస్తుందన్నారు. బిజెపి అధికారంలోకి రావడం చారిత్రక అవసరమన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+