వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉరేసినా తప్పులేదు: ఆనంపై మండిపడ్డ నటుడు నరేష్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Naresh
అనంతపురం/నెల్లూరు: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ప్రముఖ సినీ నటుడు నరేష్ ఆర్థిక శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిపై మంగళవారం మండిపడ్డారు. ఆయన అనంతపురం జిల్లాలో ఆనంపై ధ్వజమెత్తారు.

వైయస్ పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆనంను ఉరి తీసినా తప్పులేదన్నారు. నాడు పదవుల కోసం వైయస్ రాజశేఖర రెడ్డిని పొగిడిన వారు ఇప్పుడు అదే అధికార దాహంతో ఆయనపై విమర్శలు గుప్పించడం దారుణమన్నారు. వారికి ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు.

ఓటమి తప్పదు: నల్లపురెడ్డి

ఆనం రామనారాయణ రెడ్డి నిర్వహించే అధికారిక కార్యక్రమాలను తాను బహిష్కరిస్తున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి పైన, ఆయన కుటుంబం పైన అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డిలను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. నెల్లూరు ప్రజలు ఆనం సోదరులను రాజకీయంగా ఉరి తీస్తారని ఆయన హెచ్చరించారు. వైయస్‌ను, ఆయన కుటుంబాన్ని విమర్శించే హక్కు వారికి లేదన్నారు.

English summary
Actor and YSR Congress party leader Naresh has condemned minister Anam Ramanarayana Reddy comments against YS Rajasekhar Reddy and his family.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X