శ్రీవారికి ఎన్నారై రామలింగ రాజు రూ.16 కోట్ల విరాళం

రూ.11 కోట్లను లక్ష్మీ సహస్రనామాల కోసం, రూ.65 లక్షలను శ్రీవారి మెట్ల మార్గంలో జ్ఞానమందిర నిర్మాణం కోసం, మరో రూ.5 కోట్లను నిత్యాన్న దానానికి, తిరుచానూరులో అన్నదాన సత్ర నిర్మాణానికి అందించారు. భక్తుడు రామలింగ రాజు ఈ మొత్తాన్ని టిటిడి చైర్మన్ కనుమూరి బాపిరాజుకు ఈ రోజు అందించారు. ఇతను ప్రవాస భారతీయుడు.
కల్యాణానికి భద్రాచలం ముస్తాబు
భధ్రాచలం పుణ్యక్షేత్రంలో ఈ నెల19న జరగనున్న సీతారాముల కల్యాణం సందర్బంగా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అలంకరించారు. విద్యుత్ వెలుగులతో ఏర్పాటు చేసిన సీతారాముల కటౌట్లు భక్తులను ఆకట్టుకుంటున్నాయి.
బ్రహ్మోత్సవాలు ఈ రోజు నుంచి ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఈ రోజు ఉదయం ఆలయ అర్చకులు పుణ్యజలాల కోసం మంగళవాయిద్యాలతో గోదావరికి బయలుదేరి, అక్కడి నుండి పవిత్ర గోదావరి జలాలను ఆలయానికి తీసుకు వచ్చారు.












Click it and Unblock the Notifications