కళంకిత మంత్రులపై ఢిల్లీ వేటు?: బొత్స 'చీఫ్'కు ఎసరు!

Botsa Satyanarayana - Sabitha Indra Reddy
హైదరాబాద్/న్యూఢిల్లీ: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో పలువురు మంత్రులపై అభియోగాలు వచ్చిన నేపథ్యంలో కిరణ్ కుమార్ రెడ్డి మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెసు పార్టీ అధిష్టానం అంగీకారం తెలిపే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని దేశ రాజధానిలో ప్రచారం సాగుతోంది. జగన్ ఆస్తుల కేసులో హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిపై సిబిఐ తాజా ఛార్జీషీటులో అభియోగాలు నమోదు చేసిన విషయం తెలిసిందే.

దీంతో ఆమె రాజీనామా చేయాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. స్వపక్షంలోను పలువురు ఈ వాదనతో ఏకీభవిస్తున్నారు. అంతేకాకుండా మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణకు, ధర్మాన ప్రసాద రావు, సబితా ఇంద్రా రెడ్డిలకు వేర్వేరు న్యాయమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ సెగ ఢిల్లీకి తాకింది. దీంతో సబితను హోంమంత్రి బాధ్యతల నుండి తప్పించాలని అధిష్టానం భావిస్తోందని సమాచారం.

సబిత హోంశాఖ అంశంపై ఈ రోజు లేదా రేపు అధిష్టానం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి చీఫ్ బొత్స సత్యనారాయణలు ఢిల్లీకి వెళ్లారు. వారు పలు అంశాలపై అధిష్టానంతో చర్చలు జరుపనున్నారు. ప్రధానంగా జగన్ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న మంత్రుల అంశంపై చర్చించనున్నారు. సబిత శాఖ మార్పు లేదా ఆమెను పూర్తిగా తొలగించే అవకాశాలున్నాయంటున్నారు.

ఆమెను పూర్తిగా తొలగిస్తే అభియోగాలు ఎదుర్కొంటున్న మిగిలిన మంత్రులకు కూడా ఎసరుపడే అవకాశాలు ఉన్నాయి. అదే జరిగితే మంత్రివర్గ విస్తరణ జరగుతుందంటున్నారు. అయితే, తెలంగాణ సెంటిమెంట్, జగన్ హవా కారణంగా ఇప్పుడు విస్తరణకు అధిష్టానం అంగీకరిస్తుందా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది.

బొత్స 'చీఫ్'కు ఎసరు!

ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పదవికి ఎసరుపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. జోడు పదవులు అనుభవిస్తున్న బొత్స ఏదో ఒక పదవిలో మాత్రమే కొనసాగాలని రాహుల్ గాంధీ ఆదేశించారట. ఇందుకు సమయం కూడా ఇచ్చారట. ఈ అంశంపై కూడా అధిష్టానం దృష్టి సారించే అవకాశాలు ఉన్నాయి. ఏదో ఒక పదవి అయితే బొత్స మంత్రి పదవినే వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అయినప్పటికీ అధ్యక్ష పదవీ కోసం జోరుగా లాబీయింగ్ చేస్తున్నారట. కాగా, బొత్స బుధవారం ఉదయం గులాం నబీ ఆజాద్‌తో భేటీ అయ్యారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+