పిఎం: యుఎస్‌కు సారీ, బెంగళూర్ బ్లాస్ట్‌పై సైలెంట్
న్యూఢిల్లీ: అమెరికాలోని బోస్టన్‌లో జరిగిన పేలుళ్లను ప్రధాని మన్మోహన్ సింగ్ ఖండించారు. సంఘటన పట్ల విచారం వ్యక్తం చేస్తూ ఆయన అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాకు లేఖ రాశారు. బెంగళూర్ పేలుళ్ల ఘటనపై బుధవారం సాయంత్రం వరకు కూడా స్పందించలేదు. ఏ విధమైన ప్రకటన కూడా జారీ చేయలేదు.
బెంగళూర్‌లో పేలుళ్లకు ఉగ్రవాదులే కారణమని తేలినా ప్రధాని మన్మోహన్ సింగ్ పెదవి విప్పకపోవడంపై సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురుస్తోంది. మన్మోహన్ ఎందుకు మౌనంగా ఉన్నారు, కర్ణాటక రాష్ట్రాన్ని బిజెపి పాలిస్తుండడం వల్లనా, అదీ బిజెపి కార్యాలయం వద్ద పేలుళ్లు సంభవించడం వల్లనా అని ప్రజలు సోషల్ మీడియాలో అడుగుతున్నారు.
కాంగ్రెసు నాయకుడు షకీల్ ఆహ్మద్ మాదిరిగానే ప్రదాని కూడా రాజకీయాలు చేస్తూ మౌనం వహించారా అని ప్రశ్నిస్తున్నారు. దేశ ప్రజలకు సంఘీభావం ప్రకటించాల్సిన బాధ్యత ప్రధానిగా మన్మోహన్ సింగ్‌కు ఉంటుంది. ప్రమాద తీవ్రతతో సంబంధం లేకుండా ఆయన స్పందించాల్సిన అవసరం ఉంది.

బోస్టన్ పేలుళ్లను బుద్ధి లేని చర్యగా, పిరికిపందల చర్యగా మన్మోహన్ సింగ్ అభివర్ణించారు. పేలుళ్లను ఖండించడానికి భారత ప్రజలు తన గొంతుతో గొంతు కలుపుతారని ఆయన అన్నారు. బాధితులకు తమ సంఘీభావాన్ని, సానుభూతిని ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు. దర్యాప్తులో అమెరికాకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని ఆయన చెప్పారు.
బెంగళూర్ సంఘనటపై కేంద్ర హోం మంత్రి తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి ఎవరూ స్పందించలేదు. హోం మంత్రి సుశీల్ కుమార్ షిండే మొక్కుబడిగా ప్రకటన చేశారు.
-
పవన్ కళ్యాణ్ కొత్త మూవీలో "రౌడీ హీరో".. బాక్సాఫీస్ షేక్ పక్కా !! -
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో వండిన అన్నం తింటున్నారా- ఇది తెలుసుకోవాల్సిందే..!! -
కోటి 15 లక్షల మంది మహిళలకు రేవంత్ రెడ్డి వరాలు -
ఎల్లుండే.. `ఉస్తాద్..` ఫ్యాన్స్ కు పండగ -
మంత్రులు సిద్దంగా ఉండాలి, ముహూర్తం ఫిక్స్ - తేల్చి చెప్పిన చంద్రబాబు..!! -
భారత్ లో గ్యాస్ కొరతపై ఐదు నెలల ముందే చెప్పిన జ్యోతిష్యుడు ప్రశాంత్ కిని -
పెట్రోల్, డీజిల్ ధరల బాంబు- కమింగ్ సూన్ -
ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం -
బీజేపీతో విజయ్ పొత్తు? తమిళ రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్! -
ఉస్తాద్ భగత్ సింగ్ నిర్మాతలకు బిగ్ రిలీఫ్- ఏకంగా సుప్రీంకోర్టు స్టే -
AP Govt: ఏపీలో వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ఇక సులువు-తాజా రూల్స్..! -
చిన్నమ్మ పార్టీ, పేరు, జెండా, అజెండా వెల్లడి












Click it and Unblock the Notifications