టీవీ నటిపై రేప్: భారత విద్యార్థికి పదేళ్ల జైలుశిక్ష

అదే హోటల్‌లో పనిచేస్తున్న మరో వ్యక్తి సహకారంతో మారుతాళంతో గదిలోకి ప్రవేశించి టీవి నటిపై అత్యాచారం చేసినట్లు నిందితుడు తెలిపాడు. శిక్ష అనుభవించిన తర్వాత సోబీ జాన్‌ను భారతదేశానికి పంపించనున్నట్లు బ్రిటిష్ టాబ్లాయిడ్ ది సన్ రాసింది.
యుకెలో చదువుతున్న భారత విద్యార్థి కావాలనే బాధితురాలిని లండన్ హోటల్‌లో లక్ష్యంగా చేసుకున్నాడని, దాంతో ఆమె తనను తాను రక్షించులోకపోయిందని సౌత్‌వార్క్ క్రౌన్ కోర్టు న్యాయమూర్తి అలిస్టైర్ మెక్‌క్రీత్ అన్నారు.
బాధితురాలు హోటల్లో ఉండాలంటే భయపడుతోందని, తనంత తానుగా బయటకు వెళ్లడానికి కూడా భయపడుతోందని, పురుషులతో కలివిడిగా ఉండలేకపోతోందని, తనను ఎవరైనా బాధిస్తారేమోనని ఆందోళనకు గురవుతోందని న్యాయమూర్తి అన్నారు.












Click it and Unblock the Notifications