రికార్డు బద్దలు: రూ. 200 కోట్లకు నిజాం వజ్రం

క్రిస్టీ వేలం హౌస్‌లో గానీ అమెరికా భూభాగంపై గానీ అంత ధర పలికిన ఆభరణం ఇంత వరకు ఏదీ లేదు. గత రికార్డు 24.3 మిలియన్ డాలర్లు. అప్పుడు విట్టెల్స్‌బాచ్ డైమండ్ 2008 డిసెంబర్‌లో ఆ ధరకు అమ్ముడుపోయింది. పింక్ డైమండ్‌ను కొనుగోలు చేసిన వ్యక్తి తన పేరును వెల్లడించడానికి నిరాకరించాడు.
భారతదేశంలోని ప్రాచీన గోల్కొండ గనుల్లో ఈ వజ్రం లభ్యమైందని, ఫోన్ ద్వారా ఓ వ్యక్తి బిడ్డింగులో పాల్గొన్ని దాన్ని కొనుగోలు చేశాడని హౌస్ ఆఫ్ క్రిస్టీస్ వెల్లడించింది. ఈ వజ్రం మొదట్లో హైదరాబాద్ రాచకుటుంబంలో ఉండేది.
నిజాం రాజులు ప్రపంచంలోని సంపన్నుల జాబితాలో ఉండేవారు. వారి వద్ద విలువైన వజ్రాలు, ఆభరణాలు ఉండేవి. ఈ వజ్రానికిి హైదరాబాద్ నిజాంలతోనే కాకుండా బరోడా మహారాణి సీతాదేవికి కూడా సంబంధం ఉంది.












Click it and Unblock the Notifications