చీరలు, గాజులు నీ భర్తకివ్వు: అరుణపై జూపల్లి

Jupalli Krishna Rao
హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మంత్రి డికె అరుణకు, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శానససభ్యుడు జూపల్లి కృష్ణారావుకు మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. తనపై డికె అరుణ చేసిన వ్యాఖ్యలపై జూపల్లి గురువారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా మండిపడ్డారు. గాజులు, చీరలు నీ భర్తకివ్వు అని ఆయన డికె అరుణను ఉద్దేశించి అన్నారు. అరుణను కలియుగ తాటకిగా ఆయన అభివర్ణించారు. దమ్ముంటే రాజీనామా చేసి మళ్లీ పోటీ చేయాలని, ఒక్క ఓటు తేడాతో గెలిచినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని ఆయన అరుణకు సవాల్ విసిరారు.

తెలంగాణవాదాన్ని అణచివేసే కుట్రలో భాగంగా డికె అరుణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ ఆడించిట్లల్లా ఆడుతున్నారని ఆయన విమర్శించారు. అరుణను తాను సోదరిగా గౌరవించానని, కానీ బజారున పడి బజారు మాటలు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. మహిళా లోకం ఆమె భాషను, వ్యాఖ్యలను ఛీత్కరిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. తమకు దమ్ముంది కాబట్టే గద్వాలలో పాదయాత్ర చేశానని అన్నారు. అరుణ జీవితమే దందాలమయమని అన్నారు. హోంమంత్రి పదవి కోసం అరుణ ఆరాటపడుతున్నారని అన్నారు.

అరుణకు రాజకీయ భిక్ష పెట్టింది తానేనని, ఇప్పుడు అధికార దర్పంతో మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. మంత్రిగా ఉండి ఒక ప్రజాప్రతినిధిని అవమానించే విధంగా మాట్లాడడం ఏమిటని ఆయన అడిగారు. దమ్ముంది కాబట్టే తాను పది జిల్లాల్లో సాయుధ రక్షణ లేకుండా తిరుగుతున్నానని, వందలాది మంది పోలీసుల బలం చూసుకుని అరుణ ఎగిరెగిరి పడుతున్నారని జూపల్లి అన్నారు. నీ అహంభావం, అహంకారం చూసి గద్వాల ప్రజలు తనకు బ్రహ్మరథం పట్టారని అన్నారు. జూపల్లి అంటే జూలో పిల్లి అని అరుణ చేసిన వ్యాఖ్యపై ఆయన స్పందించారు. అవును తాను పిల్లినే అని, పిల్లి ప్రజల చుట్టూ తిరుగుతుందని, వారిలాగా తాము రక్తమాంసాలు తినే పులులం, తోడేళ్లం కాదని ఆయన అన్నారు.

అరుణ, ఆమె భర్త దోచుకున్న తీరును ఎవరినీ అడిగినా చెబుతారని అన్నారు. అరుణ నీచంగా, విలువలు విస్మరించి మాట్లాడుతున్నారని ఆయన దుయ్యబట్టారు. నీచ సంస్కృతి, నీచ రాజకీయం అరుణదని ఆయన అన్నారు. అరుణకు అధికారం, డబ్బులు, దర్పం కావాలని, తమకు కావాల్సింది ప్రజలని ఆయన అన్నారు. తెలంగాణపై బస్సు యాత్ర చేస్తుంటే అరుణను వైఖరి అడిగారని, ప్రజాస్వామ్యంలో అలా అడిగే హక్కు ఎవరికైనా ఉందని ఆయన అన్నారు. ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత అరుణపై ఉందని అన్నారు.

తెలంగాణ ఇవ్వకపోతే కాంగ్రెసు నుంచి పోటీ చేయవా అని ఆయన అరుణను అడిగారు. దీనికి సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. త్రేతాయుగంలో విశ్వామిత్రుడి యాగాన్ని భగ్నం చేసిన తాటకి మాదిరిగా కలియుగ తాటకి తెలంగాణ ఉద్యమాన్ని అణచి వేసే కుట్ర చేస్తున్నారని, అందుకు కిరణ్ కుమార్ రెడ్డి ఆడించినట్లు ఆడుతున్నారని జూపల్లి అన్నారు. ప్రభుత్వం అండ చూసుకుని అరుణ చూసుకుని రెచ్చిపోతున్నారని ఆయన అన్నారు. తాను నోరు తెరిస్తే అరుణ కుమిలిపోతారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+