గాలికి సుప్రీంకోర్టు షాక్: నాలుగు గనుల లీజు రద్దు

బి కెటగిరీలోని గనులకు జరిమానా విధించింది. సి కెటగిరీలోని గనుల లీజులను అన్నింటినీ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఎ కెటగిరీలోని 28 గనుల లీజును పునరుద్ధరించాలని ఆదేశించింది. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లోని గనుల లీజు సస్పెన్షన్‌కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఆంధ్ర, కర్ణాటక సరిహద్దు వివాదాన్ని త్వరగా తేల్చాలని, ఎస్‌జిఐ అందుకు పూనుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.అక్రమంగా తవ్విన ఖనిజాల అమ్మకానికి ఎస్పీవిని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు సూచించింది. గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఒఎంసి) కేసులో గురువారం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది.
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసి) అక్రమాలపై సిబిఐ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. ఒంఎసి కేసులో సిబిఐ గాలి జనార్దన్ రెడ్డిని, ఆయన సమీప బంధువు బివి శ్రీనివాస రెడ్డిని, తదితరులను ఆరెస్టు చేసింది.












Click it and Unblock the Notifications