లాభం లేదు!: గ్లామర్‌కి నీళ్లొదిలేస్తున్న బాబు!(పిక్చర్స్)
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సీని గ్లామర్‌ను క్రమంగా పక్కన పెట్టాలనే అభిప్రాయానికి వచ్చారా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో సినీ గ్లామర్‌ను నమ్ముకుంటే ఉపయోగం లేదనే అభిప్రాయానికి వచ్చారని అంటున్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని సినీ గ్లామర్ ఇమేజ్‌తోనే స్థాపించారు.
ఆయన స్థాపించినప్పటికి ఇప్పటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఇటీవల పలువురు సినీ ప్రముఖులు రాజకీయాల్లో బోర్లా పడుతున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో మెగాస్టార్ అనిపించుకున్న చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి విఫలమయ్యారు. దానిని కాంగ్రెసులో విలీనం చేశారు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ తదితరులు ప్రచారం చేసినా ఒరిగిందేమీ లేదు.
ఇలా పలు అంశాలను పరిగణలోకి తీసుకున్న చంద్రబాబు సినీ గ్లామర్ పక్కన పెట్టాలనే అభిప్రాయానికి వచ్చారట. సినీ గ్లామర్ వల్ల ప్రస్తుత పరిస్థితుల్లో వచ్చేదేమీ లేకున్నా వారి షరతులు మింగుడు పడకుండా ఉంటున్నాయట. ఇలాంటి పరిస్థితుల్లో సినీ గ్లామర్‌కు నీళ్లు వదలడమే బెటర్ అనే నిర్ణయానికి బాబు వచ్చారట. గతంలో రాజశేఖర్ జీవితలు టిడిపిలో చేరుతారనే ప్రచారం జరిగింది. జీవితకు మహిళా అధ్యక్షురాలి పదవిని అడిగారట. టిడిపి ససేమీరా అనడంతో వారు వెనక్కి వెళ్లారని వార్తలు వచ్చాయి.

మారిన పరిస్థితుల దృష్ట్యా సినీ గ్లామర్‌ను పక్కన పెట్టాలనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారట. సినీ తారల షరతులు, వారి గ్లామర్ రాజకీయాలకు ఏమాత్రం ఉపయోగపడటం లేదనే అభిప్రాయానికి వచ్చిన బాబు నీళ్లొదులాలనుకున్నారట.

వైయస్ జగన్మోహన్ రెడ్డి వైఖరితో విసుగు చెందిన రాజశేఖర్, జీవితలు తెలుగుదేశం పార్టీ వైపు మొగ్గు చూపారని కానీ చంద్రబాబు అంతగా ఆసక్తి చూపించక పోవడం వల్లనే వారు తిరిగి కాంగ్రెసు వైపు చూశారనే వాదనలు ఉన్నాయి. జీవితకు మహిళా అధ్యక్షురాలి పదవి అడగటం, బాబు ససేమీరా అనడం వల్లనే వెనక్కి తగ్గినట్లుగా వార్తలు వచ్చాయి. దీనిని వారు కొట్టి పారేయడం వేరే విషయం.

రాష్ట్ర రాజకీయాల్లోకి వస్తానంటున్న జయప్రద కూడా రాజమండ్రి టిక్కెట్ పైన హామీ ఇస్తే టిడిపిలోకి వచ్చేందుకు మొగ్గు చూపారట. కానీ చంద్రబాబు నో చెప్పడంతో ఆమె జగన్ పార్టీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారట.

ప్రస్తుతం సినీ గ్లామర్ పని చేయడం లేదనే అభిప్రాయానికి అందరూ వచ్చారు. నాడు ఎన్టీఆర్ సమయంలో ఇంత రాజకీయ చైతన్యం లేదు. అంతేకాకుండా ఆయనకు ఉన్న పాపులారిటీని కూడా ఇప్పటి వారుతో ముడి పెట్టలేమనే చెప్పవచ్చు. దీంతో ప్రస్తుతం సినీ స్టార్స్ ఇమేజ్ రాజకీయాలకు పని చేయడం లేదంటున్నారు. సినీ ఇమేజ్ అంతగా పని చేయకపోయినా కొంతైనా పని చేస్తుందనే వారు లేకపోలేదు.

గత ఎన్నికల్లో ప్రచారం చేసిన బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల వల్ల పెద్దగా ఒరిగిందేమీ లేదని తెలుగు తమ్ముళ్లు కూడా అభిప్రాయపడుతున్నారు.

చిరంజీవి ప్రజారాజ్యం పార్టీని పెట్టి ఫెయిలయ్యారని కొందరంటే ఆయన ఇమేజ్ కారణంగానే అన్ని ఓట్లు పడ్డాయని మరికొందరు చెబుతున్నారు.

రోజా, జయసుధ వంటి నేతలు కూడా ప్రభావం చూపలేకపోయారంటున్నారు. స్వయంగా రోజు ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారని, జయసుధ గెలుపుకు కారణాలు వేరని, అయినా ఆమె రాజకీయాల్లో నెగ్గుకు రాలేకపోతున్నారని గుర్తు చేస్తున్నారు. విజయశాంతి తెలంగాణతో నెట్టుకొస్తున్నారంటున్నారు. ప్రస్తుత కాలంలో రాజకీయాలు, సినీ గ్లామర్‌ను వేర్వేరుగా చూస్తున్నారని చెబుతున్నారు.
ఇటీవల ఉత్తర ప్రదేశ్ రాంపూర్ పార్లమెంటు సభ్యురాలు జయప్రద టిడిపి నేతలను సంప్రదించారట. తనకు రాజమండ్రి టిక్కెట్ ఇవ్వాలని అడిగారట. ఆ స్థానాన్ని ఇప్పటికే మురళీ మోహన్‌కు కేటాయించారు. టిడిపి ససేమీరా అనడంతో ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైపు వెళ్లాలనే నిర్ణయానికి వచ్చారట.












Click it and Unblock the Notifications