గోదావరిలో యువకుడు గల్లంతు: షిర్డీ రైలులో దోపిడీ

Devotee disappears in Godavari river
ఖమ్మం/హైదరాబాద్: భద్రాచలం దగ్గర గోదావరి నదిలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. తూర్పు గోదావరి జిల్లా గొల్లప్రోలుకు చెందిన రాజు అనే యువకుడు శ్రీరామ నవమి సందర్భంగా ఖమ్మం జిల్లా భద్రాచలం వచ్చారు. అతను గోదావరి వంతెన వద్ద స్నానానికి వెళ్లాడు. స్నానం చేస్తూ గల్లంతయ్యాడు. విషయం తెలియడంతో అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లు రాజు కోసం వెదుకుతున్నారు.

రైలులో దోపిడీ

విశాఖపట్నం-షిరిడి ప్రత్యేక రైలులో దోపిడీ జరిగింది. మహారాష్ట్రంలోని ఔరంగాబాద్ వద్ద దుండగులు పలు బోగీల్లోకి ప్రవేశించ ప్రయాణీకులకు మారణాయుధాలు చూపించి బెదిరించారు. వారి నుండి భారీగా నగదను, బంగారాన్ని, సెల్‌ఫోన్‌లను తీసుకున్నారు. ఇటీవల షిడిడీ బస్సుల్లోను దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే.

ముగ్గురు ఆత్మహత్యాయత్నం

కుటుంబ కలహాల నేపథ్యంలో ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యాయత్నం చేసిన సంఘటన కరీంనగర్ జిల్లా చిరుగుమామిడి మండలం రేకొండలో జరిగింది. రాంరెడ్డి, అతడి భార్య సుగుణ, కొడుకు రాజిరెడ్డిలు వ్యవసాయ బావి వద్ద గురువారం రాత్రి గొడవ పడ్డారు. అనంతరం వారు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వీరిని స్థానికులు 108లో కరీంనగర్ ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+