కల్యాణంలో సామరస్యం: కోటిన్నరతో జగ్గారెడ్డి నగలు

ప్రారంభమైన శోభా యాత్ర
శ్రీరామ నవమి సందర్భంగా హైదరాబాదులోని పాతబస్తీ ప్రాంతం నుండి శోభా యాత్ర ప్రారంభమైంది. దూల్ పేట నుండి ఈ యాత్ర భారీ బందోబస్తు మధ్య కొనసాగుతోంది. ఈ యాత్రలో భక్తులతో పాటు భారతీయ జనతా పార్టీ నాయకులు పాల్గొన్నారు. శోభాయాత్ర మార్గంలో సిసి కెమెరాలను ఏర్పాటు చేశారు.
కోటిన్నర బంగారు ఆభరణాలు
శ్రీ సీతారాముల కల్యాణం సందర్భంగా సంగారెడ్డి శాసనసభ్యుడు తూర్పు జయప్రకాశ్ రెడ్డి రూ.కోటిన్న రూపాయల బంగారు ఆభరణాలు చేయించారు. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని స్థానిక ఆలయంలో ప్రతి ఏటా సీతారాముల కల్యాణోత్సవాన్ని జరుపుతారు.
ఈ ఏడాది సీతారాములకు జగ్గారెడ్డి కోటిన్నర రూపాయల బంగారు ఆభరణాలు చేయించారు. బంగారు ఆభరణాలతో స్వామి వారు, అమ్మవారు దగదగలాడుతున్నారు. సంగారెడ్డి శ్రీరామ కల్యాణోత్సవానికి భక్తులు పోటెత్తారు.
భైంసాలో ఉద్రిక్తత
అదిలాబాద్ జిల్లా భైంసాలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భైంసాలో హిందూ వాహిని కార్యకర్తల శోభాయాత్రను పోలీసులు అడ్డుకున్నారు. కార్యకర్తలు, భక్తులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు లాఠీఛార్జ్ చేసి వారిని చెదరగొట్టారు.












Click it and Unblock the Notifications